ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఉమెన్స్ స్పెషల్ > "చీర"పై విజయం సాధించిన "కమలం"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"చీర"పై విజయం సాధించిన "కమలం"
FILE
కొన్నిరోజుల క్రితం చెన్నైలోని వెంకటేశ్వరా హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తోన్న వి. కమలం అనే విద్యార్థిని చీర ధరించటం అనే అంశంపై కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే...! ఈమె చుడీదార్ ధరించి క్లాసులకు హాజరు కావడంపై కాలేజీ యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. పైగా విద్యార్థినులందరూ ఖచ్చితంగా చీర ధరించే రావాలనే నియమం పెట్టింది.

దీంతో న్యాయపోరాటానికి దిగిన కమలం "జాతీయ మహిళా కమీషన్"ను ఆశ్రయించి, ఆపై మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే క్రమశిక్షణ, హుందాతనం, ఔచిత్యాన్ని పాటించేందుకోసమే తాము చీరను డ్రెస్‌కోడ్‌గా పెట్టామని కాలేజీ యాజమాన్యం కోర్టులో తన వాదనను వినిపించింది.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వెంకటరామన్.. చుడీదార్, సల్వార్‌లను దుపట్టాతో కలిపి ధరించటం అనేది సభ్యతతో కూడినదేనని తీర్పునిచ్చారు. విద్యార్థినులు చీరతోనే రావాలని నొక్కి చెప్పడం అహేతుకమే అవుతుందన్నారు. ఇదో దురదృష్టకరమైన అంశమని అభివర్ణించిన ఆయన, ఇలాంటి అంశాలను యాజమాన్యం, విద్యార్థులు సామరస్యంగా పరిష్కరించుకుని ఉంటే సరిపోయేదని వ్యాఖ్యానించారు.

ఇకమీదట కాలేజీ యాజమాన్యం విద్యార్థినులు చుడీదార్, సల్వార్‌లను దుపట్టాతో కలిపి ధరించేందుకు అనుమతినివ్వాలని వెంకటరామన్ ఆదేశించారు. అంతేగాకుండా, ఏ విధమైన డ్రెస్‌నూ నిషేధించే నిబంధనలు ఈ కాలేజీకి లేవని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే... విద్యార్థులకు తాము ఏ విధమైన డ్రెస్‌కోడ్‌ను ప్రకటించలేదని "మెడికల్ యూనివర్సిటీ" కూడా స్పష్టం చేయడం గమనార్హం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సౌందర్య లహరి...స్వప్న సుందరి...!
గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరమైన చిట్కాలు
ఆ మహిళా కెరటం నేలకొరిగిన రోజు జూన్ 17, 1858
"సమాచార హక్కు చట్టం"పై పీహెచ్‌డీ చేసిన తొలి మహిళ
వరకట్న వేధింపుదారులకి ఉరి శిక్ష: అమలే ప్రశ్న
గర్భిణీలకు ప్రత్యేకమైన ఆహారం!