1. వార్తలు
  2. »
  3. కెరీర్
  4. »
  5. కథనాలు

రాత మార్చే రెస్యూమ్

ఉద్యోగానికి ఎంపిక కావడంలో రెస్యూమ్ కీలక పాత్ర పోషిస్తుంది. రెస్యూమ్‌లో మీ గురించిన అంశాలు స్పష్టంగా
ఉద్యోగానికి ఎంపిక కావడంలో రెస్యూమ్ కీలక పాత్ర పోషిస్తుంది. రెస్యూమ్‌లో మీ గురించిన అంశాలు స్పష్టంగా, సూటిగా ఉన్నప్పుడే మీకు ఉద్యోగం ఇవ్వదలచుకున్నవారి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంటర్వ్యూ మీరు మంచి ప్రతిభ కనపరిస్తే కోరుకున్న ఉద్యోగం అపాయింట్ ఆర్డర్ రూపంలో మీ ఇంటి తలుపు తడుతుంది. ఇంత ప్రాధాన్యతను సంతరించుకునే రెస్యూమ్‌ను తయారు చేయడం పూర్తి అయినట్లయితే ఒకసారి ఈ కింది చిట్కాలను పాటించి చూడండి.

మొదటగా మీకు సంబంధించిన పూర్తి సమాచారం రెస్యూమ్‌లో పొందుపరిచారో లేదో చూడండి. పొందుపరిచిన సమాచారంతో మీ భవిష్యత్ ఉద్యోగ ప్రదాత మీలోని ప్రత్యేకతలను తెలుసుకునే అవకాశముందో లేదో తనిఖీ చేయండి. రెస్యూమ్ మీది కాదని ఇతరులది అన్నట్లుగా భావించి జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు చదవండి. రెస్యూమ్‌లోని తప్పొప్పులు గుర్తించి సవరణలు చేయండి.

అనంతరం మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు మీ రెస్యూమ్‌ను చూపించి, అందులోని సమాచారంతో వారు ఏకీభవిస్తారో లేదో కనుక్కోండి. వారి అభిప్రాయాలకు అనుగుణంగా మీ రెస్యూమ్‌కు నగిషీలు దిద్దండి. మీలోని ప్రత్యేకతలు, మీ కార్యదక్షత ఇలా మిమ్మల్ని ముందు వరుసలో నిలిపే అంశాలు మీ రెస్యూమ్‌లో చేరి ఉద్యోగానికి మిమ్మల్ని దగ్గర చేస్తాయి.

విజయం మీదే!
About Writer
PNR