|
రేపటి నుంచి ఆటో ఎక్స్‌పో ప్రారంభం
|
|
|
|
|
|
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 9 జనవరి 2008( 17:53 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | భారత్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్ రంగం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న తొమ్మిదో ఆటో ఎక్స్‌పో ప్రదర్శన గురువారం దేశ రాజధానిలో ప్రారంభంకానుంది. ఇందులో.. ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ రంగం ఆసక్తి కనపరుస్తున్న టాటా కంపెనీ ఉత్పత్తి చేసే లక్ష రూపాయల కారు నమూనాను ప్రదర్శించనున్నారు. ఈనెల 17వ తేదీ వరకు సాగే ఈ ప్రదర్శన భారత ఆటోమొబైల్ మార్కెట్ రంగ సామర్థ్యాన్ని, సత్తాను చాటనుంది.
ఈ నేపథ్యంలో.. భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) డిప్యూటీ డైరక్టర్ జనరల్ గురుపాల్ సింగ్ మాట్లాడుతూ ఏడాది క్రితం జరిగిన ఎనిమిదో ఆటో ఎక్స్‌పోలో పది కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరిగిందన్నారు. ఈ దఫా మాత్రం ఇది రెండింతలు కావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై మొత్తం రెండు వేల మంది పాల్గొనే ఈ ఆటో ఎక్స్‌పోలో 60 శాతం దేశీయ ప్రదర్శనకారులు కాగా మిగిలిన వారు ఇతర దేశాలకు చెందిన వారని వివరించారు.
ఫ్రాన్స్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డెస్ కన్‌స్ట్రక్చర్స్ డీయోటోమొబైల్స్ (ఓఐసీఏ) నుంచి ఆటో ఎక్స్‌పోకు గుర్తింపు పొందినట్టు సింగ్ చెప్పారు. ఈ ఎక్స్‌పోను సీఐఐ, భారతీయ ఆటోమొబైల్ ఉత్పత్తిదారులు మరియు విడిభాగాల ఉత్పత్తిదారుల సమాఖ్యలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. రేపు (గురువారం) నుంచి ప్రారంభమయ్యే ఈ ఎక్స్‌పో 17వ తేదీ వరకు సాగనుంది. న్యూఢిల్లీలోని ప్రగతిమైదానంలో జరిగే ఈ ప్రదర్శను నగరవాసులు రేపటి నుంచే తిలకింవచ్చని తెలిపారు.
సందర్శకుల ప్రవేశ రుసుంగా రూ.150, వ్యాపారవేత్తలకు రూ.500గా నిర్ణయించినట్టు చెప్పారు. అంతర్జాతీయ ఆటోమొబైల్ విపణిలో భారతీయ మార్కెట్ పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని 25 దేశాలకు చెందిన ప్రతినిధులు బృందాలు హాజరవుతున్నట్టు చెప్పారు. ఇందులో ఫ్రాన్స్, బ్రెజిల్, జపాన్, కొరియా తదితర దేశాల బృందాలు వున్నట్టు సింగ్ వివరించారు. ఈ ఎక్స్‌పోలో టాటా కంపెనీ లక్ష రూపాయల కారుతో పాటు.. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నుంచి ఏ-స్టార్ కారును, అలాగే జనరల్ మోటార్స్ కంపెనీ భారత మార్కెట్‌లోకి ఎస్‌యూవీ అనే కొత్త రకం కారును ప్రవేశపెడుతోందని చెప్పారు.
జపాన్‌కు చెందిన హోండా మోటార్ వచ్చే 2009లో భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే నూతన ఆటోమొబైల్ కార్ల నమూనాను ఇందులో ప్రదర్శించనుంది. మొత్తం 1.20 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను మొత్తం 12 లక్షల మంది తిలకించ వచ్చని ఆయన వివరించారు.
|