1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. కథనాలు

ఊపందుకోనున్న నిఫ్టీ?!

నిఫ్టీ సెన్సెక్స్  ఐటీ షేర్లు వృద్ధి
శుక్రవారం నాటి మార్కెట్ :
గురువారం నాటి ముగింపు ట్రేడ్ బలం పుంచుకుని దిగువ స్థాయిలో కొనుగోలుదారు సత్తాను ప్రదర్శించింది. శుక్రవారం నాటి ట్రేడింగ్ ఆరంభంలో నిఫ్టీలో 20 నుంచి మధ్య పాయింట్ల పెరుగుదలను ఆశించవచ్చు. అదేసమయంలో ప్రారంభంలోనే నిఫ్టీ 5200-5220 పరిధిని చేరుకునే అవకాశం ఉంది. రోజంతా 5185 స్థాయిని మార్కెట్‌లో నిలుపుకున్న పక్షంలో నిఫ్టీ మరింత బలాన్ని పొందవచ్చు.

నిఫ్టీ ప్రతికూలతలు, అనుకూలతలు:
5220/5250/5300 వద్ద నిఫ్టీ ప్రతికూలతను ఎదుర్కోవచ్చు. 5300 స్థాయికి పైన మార్కెట్‌లో విస్తృతమైన కొనుగోళ్లు జరిగి స్వల్ప వ్యవధిలోనే నిఫ్టీ 5340/5390 స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. 5160/5125/5070 అనుకూలతలు వద్ద నిఫ్టీ తన ఉనికిని చాటుకుంటుంది. 5070 స్థాయి దిగువన మార్కెట్‌లో విక్రయాల జోరు ఊపందుకుని స్వల్వ వ్యవధిలోనే నిఫ్టీ 5030/5000 స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

దృష్టి పెట్టవలసిన స్టాకులు: శుక్రవారం నాటి మార్కెట్‌లో రోల్టా, సత్యం, పొలారిస్, జేపీ అసోసియేట్స్, హెచ్‌డీఐఎల్, ఆన్‌మొబైల్, ఆర్‌పవర్, బజాజ్ ఆటో, హిండాల్కో స్టాకులపై ఆసక్తి కలిగిన వారు దృష్టిని కేంద్రీకరించవచ్చు.

గురువారం నాటి మార్కెట్:
చంచలమైన మార్కెట్‌లో ఐటీ కంపెనీల హవా
చంచలమైన వాణిజ్య కార్యకలాపాల మధ్య మార్కెట్లు ఆశాజనకంగా ముగిసాయి. ఆసియా, అమెరికాల నుంచి బలమైన సంకేతాలు అందాయి. విస్తృతమైన మార్కెట్లు సైతం అత్యధిక స్థాయిలో ట్రేడింగ్‌ను ముగించుకుని ముందు వరసలోని సూచీలను ప్రోత్సహించాయి.

డాలర్‌తో పోల్చి చూసినప్పుడు రూపాయి మారకం విలువ తగ్గిపోయినప్పటికీ, సాఫ్ట్‌వేరు షేర్లు కొత్త కొనుగోళ్లతో వృద్ధిని సాధించాయి. మార్కెట్ ముగిసే సమయానికి 117 పాయింట్ల వృద్ధితో సెన్సెక్స్ 17734.68 స్థాయికి చేరుకుంది. అలాగే 37 పాయింట్ల వృద్ధితో నిఫ్టీ 5191 స్థాయికి చేరుకుంది.

ఐటీ, చక్కెర పరిశ్రమకు చెందిన స్టాకులు కొనుగోలు ఆసక్తిని చవిచూడగా, బ్యాంకింగ్ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎన్ఐఐటీ టెక్, హెక్సావేర్, సత్యం, టిస్కో, బజాజ్ హింద్, రేణుకా షుగర్, జీఎమ్ఆర్ ఇన్ఫ్రా, బ్యాంక్ రాజస్థాన్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా తదితరాలు చురుకైన ట్రేడింగ్‌ను నమోదు చేసుకున్నాయి. మార్కెట్ మొత్తం టర్నోవర్ రూ. 60978.40 కోట్లుగా నమోదైంది.