ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > కథనాలు > రెండు నెలల్లో 1 కోటి ఉద్యోగాలు ఉష్ కాకి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రెండు నెలల్లో 1 కోటి ఉద్యోగాలు ఉష్ కాకి
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కాని మనదేశంలో అక్కడక్కడా అడపాదడపా ఉద్యగస్తులను తొలగిస్తున్నారు. కాని మన రాజకీయ అగ్రనేతలు ఈ సమస్యను ఎలా అధిగమించాలనే ఆలోచన ఇంతవరకు చేయక పోవడం గమనార్హం.

దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని ప్రకటిస్తామా వద్దా అని ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కవేస్తోంది. కాని ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి చాలా గందరగోళంగావుంది. సోమవారం(నిన్నటికి నిన్న) యూరోప్, అమెరికాలోని కొన్ని కంపెనీలు దాదాపు 67వేల మంది ఉద్యోగస్తులను తొలగించింది.

మన భారత దేశంలో కూడా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ(టెక్స్‌టైల్ సెక్టార్). గడచిన 45రోజులలో ఈ పరిశ్రమనుంచి దేశవ్యాప్తంగా 5 లక్షలమంది ఉద్యోగస్తులు వీధిన పడ్డారు. భారతదేశ ఆర్థిక శాఖా కార్యదర్శి కూడా దీనిని ఉదహరించారు.

ఇదే పరిశ్రమలో రాబోయే రెండు నెలల్లో దాదాపు మరో 5 లక్షలమంది ఉద్యోగస్తులు వీధిన పడనున్నారు. అంటే దాదాపు 10 లక్షలమంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.

సెజ్‌లకు సంబంధించి నిరుడు 30 వేల ఉద్యోగాలు ఊడిపోయాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇదే పరిస్థితి. ఎన్నో పెద్దపెద్ద డెవలపర్స్ కంపెనీలుకూడా తమ ప్రాజెక్టులను మధ్యలోనే నిలిపివేసిన సందర్భాలున్నాయి.

ఈ కంపెనీలపై ఆర్థిక మాంద్యప్రభావమేనని స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఎన్నో ప్రైవేట్ సెక్టార్లలో ఆర్థికమాంద్యంవలననే ఎంతోమంది ఉద్యోగస్తులను ఇంటికి పంపేసిన సందర్భాలు కోకొల్లలని విశ్లేషకులు పేర్కొన్నారు.

కాగా పరిస్థితి ఇలాగే కొనసాగితే రోబోయే రెండు నెలల్లో 1 కోటి మంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సొంతింటి కలను నిజం చేసుకోబోతున్నారా?
అమెరికా ప్రభుత్వానికి "సత్యం" రాజు లేఖ
నీళ్ళ ధరతో సమానంగా పెట్రోలు
'సత్యా'న్ని వధించిన 'రాజు'
ఎగుమతుల రంగంలో కోటి ఉద్యోగాలు ఫట్
బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏ అండ అమోఘం