సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » కథనాలు » ఆర్థికమాంద్యం ఎందుకు వచ్చింది...? (Global financial crisis | US | economy | Bank | Besh | Lehman brothers)
 
FILE
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యానికి ప్రధాన కారణం కొత్త కొత్త సాంకతిక మార్పులేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాలలో స్టీమ్ ఇంజన్ తర్వాత విద్యుత్, వాయుయానం(విమానం) టెలిఫోన్ తదితర వస్తువులను మానవుడు కనుగొన్నాడు.

మానవుడు కొత్త కొత్త వస్తువులను కనిపెట్టడంతో అభివృద్ధి చెందిన దేశాలు మరింత అభివృద్ధి చెంది లాభాలను ఆర్జించాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ఆఫీస్ డివిజన్ గత సంవత్సరంలో 1413 వందల కోట్ల డాలర్ల అమ్మకాలు కొనసాగించింది. దీనిపై 913 వందల కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆ కంపెనీ ఆర్జించింది.

ఆ కంపెనీ పొందిన లాభాలు దాదాపు 65 శాతానికి చేరుకుంది. అదేవిధంగా జెట్ ఎయిర్‌వేస్, పర్సనల్ కంప్యూటర్, జెనెటిక్ మాడిఫైడ్ విత్తనాలు మొదలైన ఉత్పత్తుల ద్వారా లాభాలను పొందాయి. వృద్ధి చెందిన దేశాలు తమ కార్మికులకు, ఉద్యోగులకు అత్యధికమైన వేతనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాయి. ఉదాహరణకు జనరల్ మోటార్స్‌లో పని చేస్తున్న వారి ప్రస్తుత జీతం రూ. 27 వేలుగా ఉంది.

జనరల్ మోటార్స్ కార్ల ఉత్పత్తికి చెందిన సాంకేతిక నిపుణత ఆ కంపెనీ వద్ద వున్నంత వరకు ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు మెరుగ్గానే ఉండింది. అత్యధికంగా వేతనాలు పొందడంతో వారి విలాసవంతమైన జీవితాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

ఆర్థికాభివృద్ధి జరిగిందిలా: కొత్త కొత్త సాంకేతిక ఉత్పత్తులను కనుగొని వాటిని అభివృద్ధి చెందిన దేశాలు ఇతర దేశాలకు ఎక్కువ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవడంతో పలు కంపెనీలు ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో విదేశీ కంపెనీల్లోని ఉద్యోగులకు అధిక వేతనాలు చెల్లించాయి. ఇదివరకటి దశాబ్దంలో ఇంటర్నెట్ సమ్రాజ్యానిది. 1998 తర్వాత ఐదు సంవత్సరాలలో సాంకేతిక వ్యవస్థ అభివృద్ధితోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.

అదే 2002లో సాంకేతిక రంగంలో మార్పులు సంభవించి క్షీణ దశకు చేరుకుంది. దీంతో ఆర్థికంగా లోటు ఏర్పడింది. అమెరికాలో పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఎందుకంటే నిర్మాణ రంగంలో మార్పులు సంభవించి చైనా మరియు తూర్పు ఆసియా దేశాలతోపాటు భారతదేశంలోనున్న కంపెనీలకు ఇచ్చే పనులుకూడా నిలిచిపోయాయి.

దీంతో మాంద్యం పెరిగిపోయింది. ఈ మాంద్యం స్వల్పమేనని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మరియు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎలన్ గ్రీన్‌స్పైన్‌లు సంయుక్తంగా ప్రకటించారు.
FILE


ఈ విధంగా ఉద్భవించిన మాంద్యం భవిష్యత్తులో తగ్గుముఖం పడుతుందనే ధీమాతోనే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తక్కువ వడ్డీకే గృహ రుణాలు అధికంగా ఇవ్వడం జరిగింది. అమెరికాలో మాంద్యం అతి స్వల్పమేనని అప్పటి అధ్యక్షుడు అమెరికా ప్రజలకు సూచించారు. దీంతో అక్కడి ప్రజలు అధిక సంఖ్యలో గృహాలను కొనుగోలు చేసేందుకు గృహ రుణాలు తీసుకుని గృహాలను కొన్నారు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.