ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్య మేఘాలు క్రమ క్రమంగా తొలగిపోతున్న నేపథ్యంలో భారతదేశానికి చెందిన పలు కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను పెంచడంతోపాటు నియామకాలను పెంచడంపై దృష్టిసారించనున్నట్లు ఓ సర్వేలో వెల్లడయింది.
ఈ సంవత్సరంలో ఇండియా ఇంక్ సగటున 8 శాతం మేర వేతనాలను పెంచే అవకాశం ఉందని గ్లోబల్ హెచ్ ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ సర్వే వెల్లడించింది. అంతేకాకుండా దేశీయ కంపెనీల్లో సగం కంపెనీలు వచ్చే మూడు నెలల కాలంలో భారీ స్థాయిలో ఉద్యోగుల నియామకాలను చేపట్టనున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.
ఇక వచ్చే సంవత్సరంలో కూడా ఉద్యోగుల జీతాలు 10.9 శాతం మేర పెరిగేందుకు ఆస్కారం ఉందని తమ అధ్యయనంలో తేలిందని మెసర్స్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ సొల్యూషన్స్ బిజినెస్ ఇండియా తెలిపింది.