పన్ను రిటర్ను దాఖలు చేస్తున్నారా...!
FILE
ఉద్యోగి ఫారం 16ను దాఖలు చేయాల్సివుంటుంది. కంపెనీ, మ్యూచ్యువల్ ఫండ్ ద్వారా డివిడెండ్ తదితర ఖాతాలను అందులో పొందుపరచాల్సివుంటుంది. అలాగే షేర్లు లేదా యూనిట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా ఆ దరఖాస్తులో తెలపాలి. దీంతో పన్ను లెక్కింపులో ఇవి మీకు వెసలుబాటుగా ఉంటాయి. అలాగే పన్నులోకి రాని కొన్ని ఖర్చులు కూడా మీరు ఆ దరఖాస్తులో తెలపాల్సివుంటుంది.
పొదుపు ఖాతా (సేవింగ్స్ బ్యాంకు) ద్వారా వచ్చిన వడ్డీ
పొదుపు ఖాతా (సేవింగ్స్ బ్యాంక్) ద్వారా వచ్చిన వడ్డీని దరఖాస్తు ఫారం 16లో తెలపాల్సివుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకులు పొదుపు ఖాతాలో కనీసం రూ. 1,000లు నిల్వ ఉండేలా చూపాలి. అదే ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకుల పొదుపు ఖాతా (సేవింగ్స్ బ్యాంకు)లో త్రైమాసికానికి కనీసం రూ. 5,000ల నుంచి రూ. 10,000ల వరకు కనీస సొమ్మును ఖాతాలో ఉంచాలి. దీనికి వచ్చే వడ్డీకి ఎలాంటి రసీదు సదరు బ్యాంకులు ఇవ్వవు. కాబట్టి ఇలాంటి వడ్డీలను కూడా మీరు ఆదాయపన్ను శాఖకు తెలపాల్సివుంటుంది.
.
ఏదేమైనప్పటికీ పొదుపు ఖాతా (సేవింగ్స్ బ్యాంకు) ద్వారా వడ్డీ కేవలం 3.5 శాతం మాత్రమే వస్తుంది. అయినప్పటికీ ఎక్కువ సొమ్మును పొదుపు ఖాతాలో వుంచే వారికి వచ్చే వడ్డీ దాదాపు రూ. 2,000లకు చేరుకుంటుంది. ఇలాంటి వారి ఖాతాలలో వచ్చిన వడ్డీని కూడా ఆదాయపన్ను శాఖ లెక్కిస్తుంది. కాబట్టి పూర్తి వివరాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి.
ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ
ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ రెండు రకాలుగా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చే ఆ వడ్డీని నెల నెలా తీసుకునే సౌకర్యం, అలాగే ఆ వడ్డీని నేరుగా అదే ఖాతాలో జమ చేసేలా ఖాతాదారుడు తీసుకునే చర్యలుంటాయి. ఇలాంటి సందర్భంలో ఖాతాదారుడు పన్ను మదింపులో సరైన విధంగా లెక్కలు చూపాల్సివుంటుంది.
అలాగే క్రమ వాయిదాలలో కూడబెట్టిన మొత్తం (క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్)లో సదరు బ్యాంకు వడ్డీని నేరుగా, కంతులవారీగా చెల్లించదు. ఈ వడ్డీని అసలుతో కలుపుకుని పరిమాణ క్రమంలో సేకరించి కాలపరిమితి పూర్తయిన వెంటనే చెల్లిస్తారు. కాలపరిమితి పూర్తి కాకముందు ఎలాంటి చెల్లింపులుండవు. ఇలాంటి ఆదాయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
సొమ్ము చెల్లించే కాలపరిమితి పూర్తయిన తర్వాత ఒకే మొత్తంలో సొమ్ము ఖాతాదారుని చేతికి అందుతుంది. అలాంటి సందర్భంలో పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను చెల్లించే ఖాతాదారుడు ఆదాయం సరిగా చూపకపోతే పన్నును తిరిగి రాబట్టుకోలేడు. ప్రతి ఖాతాదారుడు ఇలాంటి సందర్భంలో ప్రతి సంవత్సరం వడ్డీకి సంబంధించిన సర్టిఫికెట్ను ఫారం 16కు జత చేయాల్సివుంటుంది. ఇందులో టీడీఎస్తో పాటు బ్యాంకు వడ్డీ వివరాలను కూడా ఆ సర్టిఫికేట్లో పొందుపరచాల్సి వుంటుంది. ఇలాంటి సర్టిఫికేట్ చాలా అవసరం. టీడీఎస్ చెల్లించే వారికి ఈ సర్టిఫికెట్తో చాలా అవసరం ఉంటుంది.
ఎన్ఎస్సీ ద్వారా వచ్చే వడ్డీ
పన్ను మినహాయింపు కలిగిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) ద్వారా పొదుపు చేసే వారికి (దాదాపు రూ. 1,00,000ల వరకు సెక్షన్ 80 సి క్రింద పన్ను మినహాయింపు) ఆరు సంవత్సరాల పాటు వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక లక్షల రూపాయలు ఆరు సంవత్సరాల తర్వాత రూ. 1,601 లకు చేరుకుంటుంది. ఈ వడ్డీ ఆరు నెలలకు ఒకసారి దాదాపు 8.16 శాతంగా ఉంటుంది.
ఇదిలావుండగా ఈ సొమ్మును అప్పటికప్పుడే ఖాతాదారునికి నేరుగా ఇవ్వరు. దీనిని ఖాతాదారుని ఖాతాలోనే జమ చేసి కాలపరిమితి పూర్తయిన తర్వాత ఖాతాదారునికి చెల్లించడం జరుగుతుంది. అధికంగా వచ్చిన ఈ సొమ్మును పన్ను చెల్లింపులో చూపాల్సివుంటుంది.
