Europe | Ash clouds | Flights | London | America | International Airlines | Pounds | Island | బూడిద మేఘాలు తెచ్చిన తంటా...కోట్లలో నష్టాలు!!
FILE
యూరప్‌లోని ఐస్‌లాండ్ అగ్నిపర్వతం నుంచి నిరంతరాయంగా బూడిదతో కూడిన దుమ్ము, ధూళి కణాలు వెలువడుతుండటంతో విమానాలు ఆకాశంలో ప్రయాణించే వీలు లేకుండా పోయింది. బూడిదతో కూడుకున్న దుమ్ము, ధూళి మేఘాలతో కలిసి పోవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆకాశంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని. దీంతో విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. దీంతో రోజుకు 123 మిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు ఏర్పడినప్పుడు విమానసంస్థల యాజమాన్యాలకు ఎలాంటి బీమా సౌకర్యం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో లక్షలాదిమంది ప్రయాణీకులు విమానాశ్రయాలలోనే నిలిచిపోవాల్సివచ్చిందని, పైగా కొన్ని విమానాశ్రయాలు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడాయని విమానయాన ప్రయాణీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఏమాత్రం సహకారం అందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా బూడిద మేఘాల కారణంగా విమానాలు ఎక్కడికక్కడ రద్దు కావడంతో పలువురు సెలబ్రిటీలు, ప్రముఖ నాయకులకు కూడా ఇబ్బందులు తప్పలేదనడంలో సందేహం లేదు. ఇందులో భాగంగా మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నారు. రాక్ బాండ్ తన స్టేటస్ కోను విడనాడి రైలు, రోడ్డు మార్గాన ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో రెండు రోజులపాటు రాక్ బాండ్ బృందం ప్రయాణానికి వెచ్చించాల్సి వచ్చింది. అలాగే రేడియో 1డిజే క్రైస్ మొయిలెస్ న్యూయార్క్‌లో ఇవ్వాల్సిన మార్నింగ్ షోను సైతం వదులుకోవాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే ప్రముఖ నటుడు కీఫర్ సదర్‌లాండ్ లండన్ నుంచి కాలిఫోర్నియాకు ప్రయాణించాల్సివుండగా విమానాలు రద్దవ్వడంతో ఆయన తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మరో నటీమణి మిలే సైరస్ యూకేలో జరిగే తన కొత్త చిత్రం ప్రీమియర్ షోకు హాజరు కాలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ ప్రముఖులతోపాటు సాధారణ ప్రయాణీకులు సైతం తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పలువురు ప్రయాణీకులు కూడా ఎంతోకొంత నష్టాలను భరించాల్సి వచ్చిందని, ఈ నష్టం భారీగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలావుండగా గత ఆరు రోజులుగా కమ్ముకున్న బూడిద మేఘాలు శాంతించడంతో గురువారంనాటి నుంచి పలు విమానయాన సేవలను పునరుద్ధరించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమౌతున్నట్లు సమాచారం. కాగా భారతదేశానికి చెందిన ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పలు విదేశీ విమాన సర్వీసులను సైతం రేపటి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.