Food Inflation | Sharad Pawar | Agricultural Minister | పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం: దాక్కుంటున్న పవార్
FILE
మొదటి అంశాన్ని చూసినప్పుడు.. ఆయనకు పెద్ద తలనొప్పిగా పరిణమించిన అంశం ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల. ఎంత అదుపులోకి తీసుకవద్దామని యత్నిస్తున్నప్పటికీ గత ఏడాది కాలంగా కళ్లాలు లేని గుఱ్ఱంలా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతూనే ఉన్నది.
వ్యవసాయ శాఖా మంత్రి అసమర్థత వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని ఆదిలో విపక్షాలు ఆయనను ఎండగట్టాయి. దీనికితోడు తాజాగా యూపీఎ భాగస్వామ్య పార్టీల నుంచి ఆయనకు విమర్శల సెగ ఎక్కువైపోయింది. దీంతో ఎలాగైనా ఆ పదవికి సంబంధించి కొన్ని బాధ్యతలను మిగిలిన భాగస్వామ్య పార్టీల వారికి కట్టబెట్టి విమర్శల తాకిడి నుంచి తప్పించుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా ఇటీవల ఆయనకు ఐసీసీ ఛైర్మన్ పదవి దక్కడం కూడా ఒక కారణంగా చెపుతున్నారు. మరోవైపు కుమార్తె సుప్రియకు కేంద్రంలో చోటు ఇప్పించడానికి పవార్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సమస్య నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న ధ్యేయంలో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ ఉన్నట్లు తెలుస్తోంది.