ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > మార్కెట్
 
స్టాక్ మార్కెట్: 240 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
విదేశీ సంస్థాగత మార్కెట్‌దారులు షేర్లను కొనుగోలు చేసేందుకు అధిక ఆసక్తి చూపడంతో ముంబై స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన తొలి ఐదు నిమిషాల్లోనే 240 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ 15,000 బెంచ్ మార్కును తాకింది. సోమవారం ట్రేడింగ్ ముగింపులో 235 పాయింట్ల మేరకు నష్టపోయిన సెన్సెక్స్ మంగళవారం ఉదయం 239.01 పాయింట్లు లాభపడి, 15,142.04 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ సైతం 66.90 పాయింట్ల లాభపడి 4,406.40 పాయింట్లను తాకింది.

భారతీయ స్టేట్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ కేపిటల్, రిలయన్స్ కమ్యూనికేషన్‌, విప్రో, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఏసీసి, గ్రాసీం, మహీంద్ర అండ్ మహీంద్ర, మారుతి ఉద్యోగ్, టాటా మోటార్స్ షేర్లు సెన్సెక్స్ లాభపడటానికి దోహదపడ్డాయి.
మరిన్ని
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు
బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు
బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు
ప్రధాన మార్కెట్‌లలో బంగారం-వెండి ధరలు
రాష్ట్రంలోని కోడిగుడ్ల మార్కెట్‌లలో ధరల వివరాలు