1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. సెన్సెక్స్

రాష్ట్రం కోడిగుడ్లు మార్కెట్‌ ధరలు వివరాలు

రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో గురువారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో
రాష్ట్రంలోని వివిధ ఫారం గేటు మార్కెట్లలో గురువారం కోడిగుడ్ల ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కోడిగుడ్ల మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.138ల వద్ద నిలవగా, చిల్లర ధర రూ.1.60ల వద్ద నిలిచింది.

అలాగే విజయవాడ మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర రూ.136, విశాఖపట్నం మార్కెట్లో రూ.150, వరంగల్ మార్కెట్లో రూ. 139, చిత్తూరు మార్కెట్‌లో రూ.151ల మేర ధర పలికాయి.

అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.158ల వద్ద నిలవగా, నామక్కల్‌లో రూ.145ల మేర పలికాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి