స్టాక్ మార్కెట్: భారీగా పతనమైన సెన్సెక్స్
ముంబై స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ గురువారం భారీగా పతనమైమంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలిసారి అత్యధికంగా 653 పాయింట్లను కోల్పోయింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ఈ భారీ పతనం ఆరంభమైంది. తొలుత 653 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స 14,347.89 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. గురువారం 15,000.91 పాయింట్ల నుంచి ట్రేడింగ్ ప్రారంభమైంది.
కొద్ది క్షణాల్లోనే భారీగా 653.02 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ సైతం 199.80 పాయింట్లను కోల్పోయి, 4,171.15 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. గత మంగళవారం నిఫ్టీ 4,370.20 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు బాగా పతనమయ్యాయి. ముఖ్యంగా నిక్కై సంస్థ 525 పాయింట్లను కోల్పోగా.. సింగపూర్ స్టై్ టైమ్స్ 150 పాయింట్లు, తైవాన్ 310 పాయింట్లు, హాంగ్ సెంగ్ 790 పాయింట్లను కోల్పోయాయి.