1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. సెన్సెక్స్
  6. Bombay Stock Market

Sensex | Bombay Stock Market | losses | Index | BSE | NSE | Trade | Shares| Investors | తిరిగి నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్

సెన్సెక్స్
సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడం, విదేశీ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదుచేసుకోవడం వంటి కారణాలతో సెన్సెక్స్ పతనమైంది.

దీంతో సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 50 పాయింట్లు క్షీణించి, 16,669 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల నష్టంతో 4,969 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, టాటా స్టీల్, కంజ్యూమర్ డూరబుల్స్, ఆయిల్, గ్యాస్ బ్యాంకింగ్, రియాల్టీ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడం సెన్సెక్స్ పతనానికి కారణమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
About Writer
SELVI.M