1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. సెన్సెక్స్
  6. Bombay Stock Market

Sensex | Bombay Stock Market | losses | Index | BSE | NSE | Trade | Shares| Investors | అమ్మకాల ఒత్తిడి: కోలుకుంటోన్న సెన్సెక్స్

సెన్సెక్స్
దేశీయ ఐటీ, రియాల్టీ, బ్యాంక్, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్‌కు చెందిన వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. కానీ సోమవారం మధ్యాహ్నం వరకు భారీ నష్టాల దిశగా పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కాస్త కోలుకుంది.

దీంతో సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయి, 16,816 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20 పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 5,015 పాయింట్ల వద్ద పయనిస్తోంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు తిరోగమనం వైపు పయనించడంతో బాంబే స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసిరాలేదని బాంబే స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అలాగే మదుపుదారులు సైతం కొనుగోళ్లపై దృష్టి సారించకపోవడం స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైందని వారు చెబుతున్నారు.
About Writer
SELVI.M