రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లతో అగ్రోఫుడ్ పార్కులు
రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో నాలుగు అగ్రో ఫుడ్ పార్క్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ పార్క్‌ల ఏర్పాటుకు హిందూ ప్రాజెక్ట్స్, ఎస్ బ్యాంక్, నెదర్లాండ్స్‌కు చెందిన ఆల్టెర్రా సంస్థలు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మన దేశంలో ఇలాంటి ఫుడ్ పార్కులు ఏర్పాటు కానుండటం ఇదే తొలిసారి. ఈ పార్కులను నెలకొల్పే ప్రాంతాల వివరాలను నెలరోజుల్లో ప్రకటిస్తామని ఎస్ బ్యాంకు ఉన్నతాధికారులు విడుదల చేసిన అధికారిక వర్గాలు ప్రకటనలో వెల్లడించాయి.
ఈ పార్కుల్లో సముద్ర ఉత్పత్తులు. ఫుడ్ ప్రాసెసింగ్, పాల ఉత్పత్తులు వంచి తదితర విభాగాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తడ వంటి ప్రాంతాల్లో ఈ ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించారు.