ఇకపై.. పోస్టాఫీసుల్లో రైల్వే టిక్కెట్ల బుకింగ్
ఆదాయన్ని మరింతగా పెంచుకునేందుకు రైల్వే శాఖ వివిధ రకాల సేవలు అందిస్తోంది. అదేసమయంలో రైలు ప్రయాణికుల ముంగిటకు తన సేవలను విస్తృతపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఇకపై పోస్టాఫీసుల్లోనే రైల్వే టిక్కెట్లను విక్రయించే పద్దతికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. ఎక్కడో ఉండే రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ల వద్దకు వెళ్లి.. గంటల తరబడి క్యూల్లో పడిగాపులకు స్వస్తి పలుకనుంది.
ఇందుకోసం భారత రైల్వే, తపాలా శాఖలు ఓ అహగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆయా శాఖల మంత్రులు లాలు ప్రసాద్ యాదవ్, ఏ.రాజాల సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందం త్వరలో దేశ వ్యాప్తంగా ఆమలుకానుంది. తొలి దశలో దేశ వ్యాప్తంగా 30 ప్రధాన పోస్టాఫీస్లులో రైల్వే టిక్కెట్లను విక్రయిస్తారు. తర్వాత ఈ పద్దతికి రైల్వే ప్రయాణికుల నుంచి స్పందన లభించిన పక్షంలో అంచలంచెలుగా విస్తరిస్తారు.