ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > వార్తలు
 
స్టాండర్డ్ ఛార్టెర్డ్‌తో బీటీ ఒప్పందం
స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్, ప్రముఖ లీడింగ్ కమ్యూనికేషన్స్ ప్రొవైడర్‌ బ్రిటిష్ టెలీకమ్యూనికేషన్స్ (బీటీ)తో ఒప్పందం కుదుర్చుకుంది . ఈ ఒప్పందంతో స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్‌కు చెందిన శాఖలను బీటీ స్టాండర్డ్ ఛార్టెర్డ్‌లు సంయుక్తంగా 16 దేశాల్లో నెలకొల్పనున్నాయి. లండన్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా వంటి దేశాల్లో స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంక్ శాఖలు ప్రారంభం కానున్నాయని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఈ విషయమై బీటీ ఆసియా గ్లోబల్ సర్వీసెస్ అధ్యక్షుడు అలెన్ విలేకరులతో మాట్లాడుతూ... స్టాండర్డ్ ఛార్టెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో బ్యాకింగ్ విధానంలో అత్యాధునిక సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా డ్యూయల్- కోర్ ఎంపీఎల్ఎస్ నెట్‌వర్క్‌ను ఆసియా మొత్తం ప్రవేశపెట్టడానికి సహకరిస్తుందని ఆయన అన్నారు.
మరిన్ని
అహమ్మదాబాద్‌లో జంబో కింగ్ స్టోర్స్
కంపెనీ విస్తరణకు ఏంజెల్ రూ.150 కోట్ల పెట్టుబడి
బయోస్టీల్ ట్రేడింగ్‌తో వీసా స్టీల్ ఒప్పందం
బేగంపేట ఎయిర్‌పోర్టు గోల్కొండ హోటల్ కౌంటర్
వంద కోట్ల పెట్టుబడితో లక్నోలో సహారా హోటల్
"కూల్‌ క్యాబ్స్" మోడల్‌ను ఆవిష్కరించిన మారుతి