1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. వార్తలు

నూతన బీమా పాలసీని ప్రారంభించిన ఐసీఐసీఐ

ఐసీఐసీఐ ప్రొడన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ స్టేజ్ ఆర్‌పీ అనే నూతన ఇన్సూరెన్స్‌
ఐసీఐసీఐ ప్రొడన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ స్టేజ్ ఆర్‌పీ అనే నూతన ఇన్సూరెన్స్‌ను ప్రారంభించనుంది. ఆరోగ్య వైద్య సేవలకు ఈ ఇన్సూరెన్స్‌ సహకరిస్తుందని ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ భార్గవ్ దాస్ గుప్త సోమవారం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ లైఫ్‌స్టేజ్ ఆర్‌పీ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ ఇన్సూరెన్స్‌ ద్వారా పోర్ట్‌పోలియో మేనేజ్‌మెంట్, క్వార్టర్లీ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ ప్రిజర్వేషన్ వంటి మూడు ముఖ్యమైన సదుపాయాలను అందిస్తాయని గుప్తా సింగ్ వివరించారు.
About Writer
WD