ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > డాలర్ మారక రూపాయి పతనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
డాలర్ మారక రూపాయి పతనం
FILE
వరుసగా మూడో సెషన్‌లో కూడా తిరోగమనాన్నే ప్రదర్శించిన దేశీయ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మరో 7 పైసలు పడిపోయి రూ. 48,7678 వద్ద నిలిచింది. నూతన సంవత్సర సెలవు దినాల కారణంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ మార్కెట్లనుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో రూపాయి తగ్గుముఖం పట్టిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

విదేశాల్లో సెలవుల కారణంగా మార్కెట్లు పెద్దగా నడవకపోవడంతో దేశీయ రంగంలో మదుపుదార్ల సెంటిమెంటు దెబ్బతినిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. విదేశీ మారక ద్రవ్యమార్కెట్లో ట్రేడింగ్ నిరుత్సాహంగా సాగడంతో రూపాయి విలువ మరింత పడిపోయి డాలర్‌కు అత్యధికంగా రూ48.62ల వద్ద నిలిచింది.

రూపాయి కదలికలు డాలర్ కొనుగోలు, అమ్మకాలతో ప్రభావితమవుతాయని డీలర్లు చెబుతున్నారు. కొద్ది కాలం క్రితం డాలర్‌కు 39 రూపాయిలకు పెరిగిన దేశీయ కరెన్సీ విలువ 2008 డిసెంబర్ 31 నాటికి భారీగా తగ్గి 48,6970కి చేరింది. నవంబర్ మూడో వారంలో రూపాయి విలువ దశాబ్దం కనిష్టస్థాయికి పడిపోయి డాలర్‌కు 50 డాలర్లకు పతనమైంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పదినెలల కనిష్ట స్థాయికి తగ్గిన ద్రవ్యోల్బణం
విదేశీ కార్ల దిగుమతి ఇక సులభతరం
ఓఎన్‌జీసిచే ఇంపీరియల్ ఎనర్జీ కైవసం
మరింతగా తగ్గనున్న విమానయాన ఛార్జీలు
పెట్రోలుపై 11 రూపాయలు తగ్గే అవకాశం
నూతన సంవత్సరంలో మాంద్యం తీవ్రతరం