1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. వార్తలు
  6. Export

Tea | Export | Indian market | Business | Pakisthan | Iran | Irak | 14శాతం తగ్గిన దేశీయ టీ ఎగుమతులు

ఆర్థిక మాంద్యం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఏడాది జనవరి నెల నుంచి జూన్ నెల వరకు జరిగిన ఎగుమతుల్లో 14 శాతం తగ్గుదల నమోదు చేసుకుంది.

ఈ ఏడాది జనవరి నెల నుంచి జూన్ నెలలోపు తేయాకు ఎగుమతుల్లో నిరుడు ఇదే కాలానికి జరిగిన ఎగుమతులతో పోలిస్తే 10 కోట్ల 93 లక్షల కిలోగ్రాములలో 14 శాతం తగ్గింది. ఈ ఏడాది జరిగిన తేయాకు ఏగుమతుల్లో 9 కోట్ల 40 లక్షల కిలోగ్రాములుగా ఉండింది.

దేశవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తుల్లో తగ్గుదల నమోదు చేసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం కారణంగా తేయాకు డిమాండ్ తగ్గడం, దేశీయ మార్కెట్లో తేయాకు వాడకం పెరగడంతో ఎగుమతులు చేయలేకపోయినట్లు తేయాకు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ కాలంలో తేయాకు ఉత్పత్తుల్లో 3.3 శాతం తగ్గి 46.08 కోట్ల కిలోగ్రాములుగా ఉండింది.

ఇదిలావుండగా తేయాకు ఎగుమతుల్లో ఆదాయం రూ. 12.6 వందల కోట్లకు చేరుకుంది. అదే నిరుడు ఇదే కాలానికి ఈ లెక్కలు రూ. 11.6 వందల కోట్లుగా ఉండింది. దేశంలో తేయాకు వినియోగం పెరిగడంతో ఈ ఏడాది జనవరి నెలనుంచి జూన్ వరకు తేయాకు ధరల్లో నిరుడు ఇదే కాలానికి తేయాకు ధర ప్రతి కిలోగ్రాము రూ. 106.27లనుంచి రూ. 133.8లు పెరిగింది.

ఈ ఏడాది జులై నెలలో తేయాకు ధరలు ప్రతి కిలోగ్రాము రూ. 140.79గా ఉండింది. అదే నిరుడు ఇదే నెలలో రూ. 123.46లుగా ఉండింది. ప్రపంచవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తులు 75 శాతం భారత్, చైనా, శ్రీలంక, ఇండోనేషియా మరియు కెన్యాలో జరుగుతోంది.

భారతదేశంలో ఉత్పత్తయ్యే తేయాకును ముఖ్యంగా పాకిస్థాన్ మరియు ఇంగ్లాండ్ దేశాలకు ఎగుమతి చేస్తుంది. వీటితోపాటు దేశీయ తేయాకులోని ప్రత్యేకమైన రకాలను ఇరాక్, ఇరాన్ మరియు రష్యా దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు తేయాకు బోర్డు తెలిపింది.
About Writer
Gulzar Ghouse