1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. వార్తలు
  6. Future Group

Big Bazaar | Future Group | Kishore Biyani | బిగ్‌బజార్‌ను బయటకు తెచ్చే ప్రయత్నం: బియానీ

బిగ్ బజార్
ఫ్యూచర్ గ్రూపు నుంచి బిగ్‌బజార్ హైపర్‌మార్కెట్ చైన్‌ను బయటకు తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు ఆ గ్రూపు ఉన్నతాధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. గ్రూపు ప్రతిష్టాత్మక పునఃవ్యవస్థీకరణ, అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఫ్యూచర్ గ్రూపు నుంచి బిగ్ బజార్‌ను బయటకు తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు.

నాలుగేళ్లలో ఫ్యూచర్ గ్రూపు విలువను రూ.25 వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వివిధ పార్మాట్లలో 2013-14నాటికి దేశవ్యాప్తంగా అదనంగా 18 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ స్పేస్‌ను సేకరించాలనుకుంటున్నామన్నారు.

విస్తరణ కోసం అవసరమైన నిధులను సేకరించేందుకు వివిధ మార్గాలను పరిశీలిస్తున్నాము. ఇందులో బిగ్ బజార్‌ను గ్రూపు నుంచి బయటకు తీసుకొచ్చి ప్రత్యేక సంస్థగా ఉంచాలనే ఆలోచన కూడా ఉందని ఫ్యూచర్ గ్రూపు సీఈవో కిషోర్ బియానీ విలేకరులతో చెప్పారు.
About Writer
Phani