Banking sector | Canara bank | December | Q3 | Net profit | FY | BSE | Net income | Interest | 50 శాతం పెరిగిన కెనరా బ్యాంకు లాభాలు
దేశీయ బ్యాంకింగ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న కెనరా బ్యాంకు డిసెంబరు 31తో ముగిసిన తృతీయ త్రైమాసికాంతానికి వచ్చిన లాభాల్లో 50 శాతం వృద్ధి చెంది 1,052.58 కోట్ల రూపాయలు ఆర్జించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు 31తో ముగిసిన తృతీయ త్రైమాసికాంతానికి తమ బ్యాంకుకు వచ్చిన లాభాలలో 50 శాతం వృద్ధి చెంది రూ. 1,052.58 కోట్లను ఆర్జించినట్లు కెనరా బ్యాంకు గురువారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి తమ బ్యాంకుకు 701.50 కోట్ల రూపాయలు నికర లాభాలు వచ్చిందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
అదే విధంగా గడచిన త్రైమాసికంలో వచ్చిన నికర ఆదాయంలోను వృద్ధి చెంది 5,469.10 కోట్ల రూపాయలు వచ్చిందని, అదే అంతకు మునుపు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి వచ్చిన నికర ఆదాయం రూ. 5,382.90 కోట్లుగా ఉండింది.
గడచిన త్రైమాసికంలో బ్యాంకుకు వడ్డీ ద్వారా వచ్చిన ఆదాయంలో వృద్ధి చెంది రూ. 4,687.81 కోట్లకు చేరుకుంది. అదే గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ. 4,625.44 కోట్లుగా ఉండిందని కెనరా బ్యాంకు పేర్కొంది.