అసెంటియా టెక్నాలజీస్‌కు 2.1 మిలియన్ యూరోల ఆర్డర్
అసెంటియా టెక్నాలజీస్ లిమిటెడ్ 2.1 మిలియన్ యూరోల విలువగల ఆర్డర్లను కైవసం చేసుకుంది. ఈ ఆర్డర్ ద్వారా లండన్‌లోని అసెంటియాకు చెందిన హాస్పిటల్లో సాఫ్ట్‌వేర్ ప్రొసెస్ మేనేజ్‌మెంట్ చర్యలను చేపట్టనుంది. ఈ విషయమై అసెంటియా టెక్నాలజీస్ సీఈఓ ప్రదీప్ సుశీల విశ్వంభర విలేకరులతో మాట్లాడుతూ...
లండన్‌లో చేపట్టనున్న ఈ సాఫ్ట్‌వేర్ హాస్పిటల్ ప్రొసెస్ మేనేజ్‌మెంట్ ప్రక్రియ విజయవంతమైన పక్షంలో యూరోప్ ప్రాంతంలో తమ కంపెనీ ఉత్పత్తుల తయారీని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. దీనితో అసెంటియా విదేశాల్లో వాణిజ్య పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.
అంతేకాకుండా రాబోయే 12 నెలల్లో మరో ఐదు ప్రాంతాల్లో అసెంటియా కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని విశ్వంభర వివరాలందించారు. ఆర్డర్ ద్వారా లండన్ హాస్పిటల్స్‌లో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ (ఈఎంఆర్) మేనేజ్‌మెంట్, బిల్లింగ్ అండ్ రీ-కన్సిలియేషన్ విధానాలను ఏర్పాటు చేయనుందని విశ్వంభర ఆ ప్రకటనలో తెలిపారు.