1. వార్తలు
  2. »
  3. ఐటీ
  4. »
  5. ఐటీ వార్తలు

"గిటెక్స్ దుబాయ్ 2007" ఎగ్జిబిషన్లో భారత్ ఐటీ కంపెనీలు

గిటెక్స్ దుబాయ్ 2007
"గిటెక్స్ దుబాయ్ 2007" ఐటీ ఎగ్జిబిషన్లో భారత్‌కు చెందిన 30 కంపెనీలు పాల్గొననున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఎస్‌సీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో ఐటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా కంపెనీలు కూడా పాల్గొననున్నాయి.

ఐటీరంగ విస్తరణ దిశగా ఏర్పాటవుతున్న గిటెక్స్ ఎగ్జిబిషన్‌ ప్రపంచ వ్యాప్తంగా మూడోసారి జరగడం గమనార్హం. ఈ విషయమై ఈఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డీకే సరీన్ విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్న ఐటీ కంపెనీలు, అవుట్‌సోర్స్ కంపెనీలు, డెవలపర్స్ తమ తయారీలను, వాటికి సంబంధించిన సొల్యూషన్లు ఈ ప్రదర్శనలో చోటు చేసుకోనున్నాయి.

తద్వారా పలు ఐటీ సంస్థలు గుల్ఫ్‌ డిజిటల్ మార్కెట్లో స్థానం సంపాందించుకునే అవకాశం ఉందని సరీన్ వివరాలందించారు.