యూపీ తంతి తపాలా శాఖతో హచ్ ఒప్పందం
ప్రముఖ టెలికాం కంపెనీ హచ్ ఉత్తర ప్రదేశ్ తంతి తపాలా శాఖతో బుధవారం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ సేవలను రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో విస్తరించే దిశగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూపీ ఛీప్ పోస్ట్ మాస్టర్ జనరల్ నీలం శ్రీవాస్తవ, హచ్ ఉన్నతాధికారులు విలేకరులతో వివరాలందించారు.
వైడ్ నెట్‌వర్క్‌ను తంతి తపాలాతో సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించే దిశగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని హచ్ టెలికాం ఉన్నతాధికారి శంకర్ బాలి, రోహిత్‌లు విలేకరులతో చెప్పారు.
అంతేకాకుండా తంతితపాలా శాఖతో సంయుక్తంగా నిర్వహించే సేవలద్వారా హచ్ వినియోగదారులకు పోస్ట్‌పైడ్, ప్రీ పెయిడ్ కనెక్షన్లను పెంపొందించే అవకాశముందని వారు చెప్పారు. ఈ ఒప్పందంతో సిమ్ రీ ప్లేస్‌మెంట్, పోస్ట్‌పెయిడ్ బిల్ పేమెంట్ చెల్లింపులను పోస్ట్ ఆఫీసుల్లో చెల్లించే సేవలను హచ్ ప్రారంభించనుందని వారు వివరాలందించారు.