1. వార్తలు
  2. »
  3. ఐటీ
  4. »
  5. ఐటీ వార్తలు

నూతన రోమింగ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన టాటా ఇండికాం

ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ టాటా సర్వీసెస్ లిమిటెడ్ నూతన రోమింగ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది.
ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ టాటా సర్వీసెస్ లిమిటెడ్ నూతన రోమింగ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. "బిజినెస్ సిల్వర్ రోమ్" అనే పేరిట ఆవిష్కరించిన ఈ ప్లాన్‌ కర్ణాటక వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని టాటా సర్వీసెస్ ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

టాటా ప్రవేశపెట్టిన ఈ రోమింగ్ విధానం ద్వారా రోమింగ్ రెంటల్‌ను వసూలు చేసే విధానం లేదని ఆ ప్రకటన వివరాలు తెలిపింది. అంతేకాకుండా మొదటి 750 నిమిషాలతో కూడిన ఇన్‌కమింగ్ కాల్స్‌కు రోమింగ్ ఛార్జీలు లేవని పేర్కొంది. 750 నిమిషాలకు అనంతరం ఒక కాల్‌కు 50 పైసలును మాత్రమే వసూలు చేస్తుందని టాటా ఇండికామ్ విడుదల చేసిన ప్రకటన వివరాలు వెల్లడించాయి.
About Writer
WD