1. వార్తలు
  2. »
  3. ఐటీ
  4. »
  5. ఐటీ వార్తలు

12వేల సీడీఎంఏ ఉపకరణాలను ఎగుమతి చేసిన జీటీఈ

ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ జీటీఈ కార్పొరేషన్ (జీటీఈ) 12వేల సామర్థ్యంగల సీడీఎంఏ
ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ జీటీఈ కార్పొరేషన్ (జీటీఈ) 12వేల సామర్థ్యంగల సీడీఎంఏ ఆధారిత ఉపకరణాలను ఎగుమతి చేసింది. ఈ ఏడాదికి సగంలోనే 12వేల సామర్థ్యపు ఉపకరణాలను ఎగుమతి చేసి రికార్డును సృష్టించిందని జీటీఈ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఈ విషయమై జీటీఈ సీడీఎంఏ ప్రాడెక్ట్‌ జనరల్ మేనేజర్ జు జిన్యున్ విలేకరులతో మాట్లాడుతూ... సీడీఎంఏ ఉపకరణాల ఎగుమతిని గత ఏడాదితో పోల్చితే 240 ఎగుమతి శాతం పెరిగిందని చెప్పారు. గత 2001వ సంవత్సరం జీటీఈ 55వేల సీడీఎంఏ సెట్లను ఎగుమతి చేసిందని జిన్యున్ వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా 20వేల సెట్లను అదే సంవత్సరంలో జీటీఈ ఎగుమతి చేసిందని తెలిపారు. ప్రస్తుతం జీటీఈ దేశవ్యాప్తంగా 43 మిలియన్ల లైన్లను కలిగి ఉందని వివరాలందించారు. అంతేకాకుండా మలేషియాలో 15 మిలియన్ల లైన్లను కలిగి ఉందని జు జిన్యున్ చెప్పారు.
About Writer
WD