బీపీఓ రంగంలో భారత్‌ను అధికమించనున్న చైనా: నాస్కామ్
రానున్న మూడు నుంచి ఐదేళ్ళ కాలంలో చైనా బీపీఓ రంగం భారత్ బీపీఓ రంగాన్ని అధికమించనున్నట్టు నాస్కామ్ వెల్లడించింది. భారత్ కన్నా అవుట్ సోర్సింగ్ రంగంలో చైనా మెరుగైన సౌకర్యాలు కల్పించనుందని ఐటీ బీపీఓ రంగంపై జరిగిన ఓసర్వే వెల్లడించింది. ప్రస్తుతం చైనా బీపీఓ రంగం అభివృద్ధి దశలోనే ఉంది. అంతేకాకుండా 2010 నాటికి చైనా సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ ఆదాయం 22 శాతం వృద్ధితో 28 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఆ సర్వే వెల్లడించింది.
అలాగే గత 2006 సంవత్సరంలో ఈ రంగంలో చైనా ఆదాయం రికార్డు స్థాయిలో 12.3 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఇదిలావుండగా 2007-08 సంవత్సరంలో భారత్ ఐటీ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ ఆదాయం 50 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని నాస్కామ్ పేర్కొంది. ఈనేపథ్యంలో చైనాలోని ఐటీ సంస్థలతో కలసి ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకుసాగాలని నాస్కామ్ భారత్ సంస్థలకు సూచించింది.
భారత్ ఐటీ, బీపీఓ ఎగుమతులు అమెరికా, బ్రిటన్ మార్కెట్ల పైనే ప్రధానంగా ఆధారపడివున్నాయి. దాదాపు భారత్ ఎగుమతుల్లో 80 శాతం ఈ దేశాల మార్కెట్లకు చెందినవే. అయితే చైనా ఎగుమతులు ప్రధానంగా జపాన్, కొరియా మార్కెట్లపైనే ఆధారపడి ఉన్నాయి.