1. వార్తలు
  2. »
  3. ఐటీ
  4. »
  5. ఐటీ వార్తలు

లాటిన్ అమెరికాలో ఇన్ఫోసిస్ సేవలు

ప్రముఖ ఐటీ సంస్థగా పేరుగాంచిన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లాటిన్ అమెరికాలో తమ సేవలను ప్రారంభించనుంది.
ప్రముఖ ఐటీ సంస్థగా పేరుగాంచిన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లాటిన్ అమెరికాలో తమ సేవలను ప్రారంభించనుంది. ఈ మేరకు యూఎస్‌, మెక్సికోలోని మాంటెరీ ప్రాంతంలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఈ విషయమై ఇన్ఫోసిస్ సీఈఓ గోపాలకృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ... మల్టీప్లై జియోగ్రాఫీస్‌లు వంటి సాంకేతిక అంశాలను క్లైంట్లకు అందించే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫోసిస్ సేవలను కొనసాగించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

అంతేకాకుండా బాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రీటైల్, కన్సూమర్ ప్యాకేజ్‌డ్ గూడ్స్ వంటి తదితర అంశాల అభివృద్ధికి ఈ కేంద్రం ఏర్పాటు సహకరిస్తుందని గోపాలకృష్ణన్ చెప్పారు. ఈ కేంద్రంలో ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లను నిర్వహించనున్నట్లు ఆయన వివరాలందించారు. వీటితో పాటు 1000 మందికి ఉపాధి అవకాశాలు అందించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గోపాలకృష్ణన్ తెలిపారు.
About Writer
WD