జీఎస్ఎమ్ పీసీఓ ఫోన్లను ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్
ప్రముఖ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ జీఎస్ఎం పీసీఓ ఫోన్లను తమిళనాడులో ప్రవేశపెట్టింది. వినియోగదారుల అవసరాల మేరకు తమిళనాడు రాష్ట్రంలో ఈ సేవలను ఎయిర్‌టెల్ ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎనీటైమ్-ఎనీవేర్ కనెక్టివిటీ కోసం టెలీడెన్‌సిటీని వినియోగదారులకు అందించేదిశగా ఎయిర్‌టెల్ సన్నాహాలు చేస్తున్నట్లు ఆ ప్రకటన తెలిపింది.
ఈ విషయమై ఎయిర్‌టెల్ మొబైల్ సర్వీసెస్ సీఓఓ మహేష్ తంపి విలేకరులతో మాట్లాడుతూ... వినియోగదారుల సంఖ్యను పెంచేదిశగా నూతన టెలికామ్ సేవలను ప్రారంభించనున్నామని అన్నారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన జీఎస్‌ఎం పీసీఓ ఫోన్లు రూ.1999కి లభిస్తాయని ఇందులో ఉచిత టాక్‌టైమ్ రూ.2250కి అందిస్తారని చెప్పారు.