1. వార్తలు
  2. »
  3. ఐటీ
  4. »
  5. ఐటీ వార్తలు

చిన్న తరహా నగరాల్లో ఎంఎస్ డబ్ల్యూ-మొబైల్ సేవలు

మొబైలిటీ అట్ మైక్రోసాఫ్ట్‌ సంస్థ డబ్ల్యూ- మొబైల్
మొబైలిటీ అట్ మైక్రోసాఫ్ట్‌ సంస్థ డబ్ల్యూ- మొబైల్ సేవలను చిన్న నగరాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన హ్యాండ్‌సెట్లను వినియోగదారులకు సదుపాయంగా ఉంటాయని ఎంఎస్ ఉన్నతాధికారి సుమిత్ గుగ్నాని విలేకరులతో చెప్పారు. ఈ మొబైల్ సేవలను ఉత్తర భారతదేశంలోని బర్దమన్, హాల్డీయా, దుర్గాపూర్, అసన్సోల్, సిలిగురి వంటి చిన్న తరహా నగరాల్లో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.

మైక్రోసాఫ్ట్ విండోస్ మొబైల్‌ను గత జూలై 2006 నాటికి విడుదల చేసింది. ప్రస్తుతం ఆవిష్కరించనున్న ఈ మోడల్ మొబైల్ ఫోన్లు నెలకు 8వేల మొబైల్‌లను విక్రయిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. రాబోయే 2008 ఏడాది చివరికి 2లక్షల మొబైళ్లను మైక్రోసాఫ్ట్‌ దేశవ్యాప్తంగా విక్రయిస్తుందని గుగ్నానీ ఆశాభావం వ్యక్తం చేశారు.