1. వార్తలు
  2. »
  3. ఐటీ
  4. »
  5. ఐటీ వార్తలు

హవాయిన్ ఎయిర్‌లైన్స్‌తో టీసీఎస్ ఒప్పందం

హవాయిన్ ఎయిర్‌లైన్స్‌తో టీసీఎస్ ఒప్పందం
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టన్సీ (టీసీఎస్) హవాయిన్ ఎయిర్‌లైన్స్‌తో మల్టీ-ఇయర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయని టీసీఎస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ద్వారా గ్లోబల్ నెట్‌వర్క్ డెలివరీ మోడల్, రెవెన్యూ కౌటింగ్ వంటి చర్యలు చేపట్టనుంది.

బిజినెస్ ప్రొసెస్ అవుట్‌సోర్సింగ్‌తో పాటు ఇన్ఫ్రాక్చర్ సేవలను కూడా ఈ ఒప్పందంతో టీసీఎస్ హవాయిన్‌కు అందించనుంది. ఎండ్‌-టు-ఎండ్ అప్లికేషన్ మెయింటెనెన్స్, ఆటోమేటడ్ ప్యాసింజర్ రెవెన్యూ అకౌంట్‌సిస్టమ్‌లను ఏర్పాటు చేయనుందని టీసీఎస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.