ఈశాన్య భారత దేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరో వెయ్యి పోస్టాఫీసులను నెలకొల్పడానికి కేంద్ర సమాచార సాంకేతికత, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈశాన్య భారతదేశంలో 6,637 పోస్టాఫీసులు ఉన్నాయని కేంద్ర ఐటి శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని 34,774 గ్రామాల్లో ఇప్పటికీ పోస్టల్ కౌంటర్లు లేవని దీనివల్ల రోజువారీ ఉత్తరాల బట్వాడాకు భంగం కలుగుతోందని చెప్పారు. లెటర్ బాక్సులనుంచి మెయిల్ సేకరణ, స్టాంపుల అమ్మకాలకు కూడా దీనివల్ల ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.ఈ గ్రామాల ప్రజలు ప్రాధమిక పోస్టల్ సౌకర్యాలను పొందడం కోసం సమీపంలోని గ్రామాల పోస్టాఫీసుల వద్దకు వెళుతున్నారని, పంచాయత్ సంచార సేవా కేంద్రాలు వంటి ప్రత్యామ్నాయ సేవా కేంద్రాలను ఉపయోగించుకుంటున్నారని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం, వనరుల లభ్యత బట్టి ఈ ప్రాతంలో అదనపు పోస్టాఫీసులను దశలవారీగా నియమిస్తామని ఐటి శాఖ అధికారులు తెలిపారు. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |