1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. జాతీయ వార్తలు

కాంగ్రెస్‌పై యూపీఏ మిత్రపక్షాలకు నమ్మకం ఉంది: ప్రణబ్

భారత్-అమెరికా దేశాలు సంయుక్తంగా కుదుర్చుకున్న చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందం విషయంలో యూపీఏ కూటమిలోని భాగస్వామ్య
భారత్-అమెరికా దేశాలు సంయుక్తంగా కుదుర్చుకున్న చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందం విషయంలో యూపీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ముఖ్యంగా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీపై వారికి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ అణు ఒప్పందంపై లెఫ్ట్‌ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే.

దీనిపై ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ అణు ఒప్పందాన్ని అమలు చేసే ముందు లెఫ్ట్ పార్టీల అభ్యంతరాలను ఖచ్చితంగా పరిగణంలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అణు ఒప్పందాన్ని అమల్లోకి తెస్తే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ హెచ్చరించిన విషయం తెల్సిందే.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి