ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
మణిపూర్‌లో 15 మంది అల్‌ఖైదా అనుచరుల అరెస్టు
మణిపూర్ రాష్ట్రంలో అల్‌ఖైదా తీవ్రవాద సంస్థకు చెందిన 15 మంది అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. మియన్మార్ సరిహద్దుల్లోని మణిపూర్ రాష్ట్ర చండల్ జిల్లాలలో వీరిని అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. వీరిలో పది మంది మియన్మార్‌కు, మిగిలిన ఐదుగురు బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా చెల్లిని పత్రాలతో భారత్‌లోకి ప్రవేశించినట్టు విచారణలో వెల్లడైంది.

అస్సాం రాష్ట్రంలోని సిల్చార్, మణిపూర్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అరెస్టు చేసిన అల్‌ఖ్వైదా అనుచరుల నుంచి యూఎస్ డాలర్‌లతో పాటు.. విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో నాసన్ (42), ఫైజు రెహ్మాన్ (17), సలాం (21), అబ్దుల్ హుస్సేన్ (42), రెహ్మాన్ (18)లు బంగ్లాదేశీయులు కాగా.. మిగిలిన వారంతా మియన్మార్‌కు చెందినవారిగా గుర్తించారు.
మరిన్ని
నేడు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
"ఖల్‌నాయక్" బెయిల్ పిటీషన్‌పై నేడు విచారణ
కాంగ్రెస్‌పై యూపీఏ మిత్రపక్షాలకు నమ్మకం ఉంది: ప్రణబ్
యూపీఏ సర్కారుకు నాలుగు నెలల గడువు..!
అణు ఒప్పందాన్ని వ్యతిరేకించిన మమత బెనర్జీ
రేపు వామపక్ష నేతల కీలక భేటీ