1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. జాతీయ వార్తలు

భవిష్యత్తులో అవసరాలను అణుశక్తి పూర్తి చేస్తుంది: ప్రధాని

నానాటికి పెరుగుతున్న అవసరాలను భవిష్యత్తులో అణుశక్తి పూర్తి చేస్తుందని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు.
నానాటికి పెరుగుతున్న అవసరాలను భవిష్యత్తులో అణుశక్తి పూర్తి చేస్తుందని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఓఎన్‌జీసీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ... దేశంలో అణుశక్తి అవసరం ఎంతో ఉందని అన్నారు.

భవిష్యత్తులో ఈ అణుశక్తి అవసరాలను తీర్చేందుకు ఈ యూఎస్ ఒప్పందం సహకరిస్తుందని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. అణుశక్తి అవసరాలను గురించి వామపక్షాలు అవగతం చేసుకోవాలని చెప్పారు. పెట్రోలియం వంటి చమురు దిగుమతి చేసే ప్రక్రియ భారత్‌కు తీరని సమస్యగా ఉందని తెలిపారు.

దేశంలో చమురు ఉత్పత్తి మొత్తం అవసరాలను తీర్చే విధంగా లేదని ప్రధాని వివరించారు. ఇటువంటి సమస్యలను తీర్చేందుకు అణుశక్తి ఎంతో అవసరం ఉందని తెలిపారు. యూఎస్ ఒప్పందంతో ఈ అణుశక్తి అవసరాలను తీర్చే దిశగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మన్మోహన్ సింగ్ చెప్పారు.