ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
రొనన్ సేన్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఉభయసభలు
ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై అమెరికాలోని భారత రాయబారి రొనెన్ సేన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం దద్దరిల్లి పోయాయి. ఈ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. అణు ఒప్పందానికి కేంద్రం కేబినెట్‌తో పాటు.. అమెరికా ఆమోదముద్ర వేసిందని గుర్తు చేశారు. అయితే.. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడం అర్థరహితమని, అలాంటి వారిని తలలేని వారిగా రొనన్ పేర్కొన్నారు. వీటిని కొన్ని వార్తా పత్రికలు ప్రచురించాయి. వీటిని ఆధారంగా చేసుకున్న ప్రతిపక్ష నేతలు.. రొనెన్‌ సేన్‌ను తక్షణం భారత్‌కు పిలిపించి వివరణ కోరాలని డిమాండ్ చేశారు.

సీపీఐ జాతీయ నేత డి.రాజా మరో అడుగు ముందుకు తక్షణం రొనన్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ మహిళా నేత సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కల్పించుకున్న స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ రొనన్ అలా వ్యాఖ్యానించి ఉంటే.. తానే చర్య తీసుకుంటాని సభకు హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా వివరణ ఇవ్వడమే కాకండా.. రోనన్ వ్యాఖ్యలను ఖండించారు. అయినప్పటికీ సభలో ప్రశాంత వాతావరణం నెలకొనక పోవడంతో ఇరుసభలు వాయిదా పడ్డాయి.
మరిన్ని
యూపీఏ సర్కారు పూర్తికాలం ఉండదు: అద్వానీ
ఎన్డీయే డిమాండ్‌ను తోసిపుచ్చిన కేంద్రం
కేంద్రంలో మధ్యంతర సమస్యే లేదు: జ్యోతిబసు
అణుఒప్పందం అమలును నిలిపివేయాలి: ఏచూరీ
భవిష్యత్తులో అవసరాలను అణుశక్తి పూర్తి చేస్తుంది: ప్రధాని
'మున్నాభాయ్‌'కు బెయిలు మంజూరు చేసిన సుప్రీం