ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వం: శ్రీరామ్ సేన
వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్ స్పష్టం చేశారు. కేవలం అధికారం కోసమే భారతీయ జనతా పార్టీ హిందూత్వ ఎజెండాను వాడుకుంటుందోని ఆయన శనివారం చెన్నైలో ఆరోపించారు. హిందూ మక్కల్ కట్చి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కర్ణాటక భాజపా ప్రభుత్వం మీకు మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించగా, తనను మంగుళూరుకు వెళ్లకుండా నిషేధం విధించారని, సంస్థ కార్యకర్తలు కొందరిని జైల్లో పెట్టారని సమాధానం ఇచ్చారు.
దేశంలో పెచ్చుమీరుతున్న పబ్ సంస్కృతికి తాము వ్యతిరేకమని చెప్పారు. దీని నిర్మూలనకు తాము ఎంచుకున్న ఆందోళన మార్గం సరైనది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. మంగళూరు పబ్‌లపై దాడులు చేసిన యువతులపై చేయి చేసుకుని సంచలనం సృష్టించిన శ్రీరామ్ సేనపై దక్షిణ గోవాలో నిషేధం విధించారు.
గతవారం ఉత్తర గోవా జిల్లా కూడా ఈ సంస్థకు చెందిన కార్యకర్తల జిల్లా ప్రవేశంపై నిషేధం విధించింది. దీంతో గోవాలోని పలు ప్రాంతాల్లో శ్రీరామ్ సేనపై ఆంక్షలు విధించినట్టు అయింది. దక్షిణ గోవాలో ఆ సంస్థ కార్యకర్తలు ప్రవేశించరాదని ఆదేశిస్తూ కలెక్టర్ మహిర్ వర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు.