Centre | Lifts ban, Pre-paid mobile | Phones | Jammu and Kashmir | జేకేలో ప్రీపెయిడ్ మొబైల్స్‌పై నిషేధం ఎత్తివేత: కేంద్రం
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లపై ఉన్న నిషేధాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ఎత్తివేసింది. అయితే, నిబంధనలను మాత్రం మరింత కఠినతరం చేసింది. ప్రధానంగా ప్రీపెయిడ్ కష్టమర్ల చిరునామాలను ఖచ్చితంగా పరిశీలించి ధృవీకరించాలని పేర్కొంది.
జేకేలోని ప్రీపెయిడ్ నంబర్లు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించడంతో కేంద్రం వీటిపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. దీంతో లక్షలాది మంది కస్టమర్లు తన మొబైల్ ఫోన్ కనెక్షన్లను కోల్పోయారు. దీనిపై టెలికాం ఆపరేటింగ్ కంపెనీలు కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేసుకున్నారు.
మొత్తం 38 లక్షల ప్రీపెయిడ్ కనెక్షన్ల వినియోగదారులు సమర్పించిన ఆధారాలను సరిచూసిన తర్వాత వీటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినట్టు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. గత యేడాది నవంబరు నెల నుంచి ఈ నిషేధాన్ని అమలుకు తెచ్చారు. ఆ తర్వాత టెలికాం కంపెనీలు పూల్ ప్రూఫ్ ఆధారాలను సమర్పించడంతో సంతృప్తి చెందిన హోంశాఖ ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.