1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. ఫెంగ్ షుయ్

చైనా వాస్తు శాస్త్రం పెంగ్‌షుయ్‌లోని ముఖ్యాంశాలు

చైనా దేశంలో వాస్తు శాస్త్రమైన ఫెంగ్‌షుయ్ ఇప్పుడు మన దేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఫెంగ్‌షుయ్‌ వాస్తును
చైనా దేశంలో వాస్తు శాస్త్రమైన ఫెంగ్‌షుయ్ ఇప్పుడు మన దేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఫెంగ్‌షుయ్‌ వాస్తును అనుసరిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది. చాలా ఇళ్లలో ఫెంగ్‌షుయ్‌కి సంబంధించిన వస్తువులు కనిపిస్తున్నాయి. అదే విధంగా దుకాణాల్లోనూ వీటి అమ్మకాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెంగ్‌షుయ్ చెబుతున్న అతి ముఖ్యమైన వాస్తు విశేషాలు కొన్ని మీకోసం....

కర్పూర దీపం :
ప్రతి రోజూ కర్పూర దీపం వెలిగిస్తే అది మీ ప్రతికూల శక్తులను తొలగిస్తుందట. దీని వెలుగు మీకు మరింత అభివృద్ధిని చేకూర్చుతుందని ఫెంగ్‌షుయి అంటోంది.

చైనా నాణాలు :
మనల్ని వెంటాడే దుష్ట శక్తులు, పీడించే అనారోగ్యాన్ని పారద్రోలడానికి చైనా నాణాలు ఉపకరిస్తాయట. వీటిని వందలాది ఏళ్ళుగా వాడుతున్నారు.

జంట పావురాలు :
అనుబంధాలకు ప్రతీకలు జంట పావురాలు. వీటిని మీ ఇంట్లోని నైఋతి మూలలో అమర్చినట్లయితే ఘర్షణలు లేకుండా సాఫీగా సాగే ఆరోగ్యకర అనుబంధాలు ఏర్పడతాయట.

డాల్ఫిన్ :
ఆడుతూ... చురుకుగా కదలాడుతూ కనువిందు చేసే డాల్ఫిన్ బొమ్మను శుభానికి ప్రతినిధిగా ఫెంగ్‌షుయి చెబుతోంది. శుభ సూచకమైన డాల్ఫిన్‌ను మీ ఇల్లు, కార్యాలయాల్లో ఉత్తర మూల లేదా ఆరోగ్య మూలగా అమర్చాలట.
ముత్యం :
నవరత్నాల్లో ఒకటైన ముత్యానికి ఫెంగ్‌షుయిలోనూ తగిన ప్రాధాన్యత ఉంది. భావావేశం, బుద్ధి, సంపద మరియు సమూహంపై నేరుగా ప్రభావం చూపే చంద్రునితో సామరస్యాన్ని కల్పించేది ముత్యం.

ధననౌక :
డ్రాగన్‌ ఆకారంలో లభించే ధననౌక ఫెంగ్‌షుయి ప్రకారం సిరిసంపదలకు ప్రతీక. ఇది ఐశ్వర్యాన్ని వృద్ధి చేసే అదృష్ట చిహ్నం. అయితే ఈ ధననౌకను లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా అమర్చుకోవాలట.

విద్యా గోపురం :
విద్యాభ్యాసం చేస్తున్న పిల్లల పడక గదిలో విద్యా గోపురాన్ని ఈశాన్య మూలగా ఉంచాలని ఫెంగ్‌షుయి సూచిస్తోంది. తద్వారా విద్యాశక్తి పెరగడంతో పాటు వ్యతిరేక శక్తులు అనుకూల శక్తులుగా మారతాయట.

ధనవృద్ధి పిరమిడ్‌ :
పేరులోనే ఉంది దీని ఉపయోగం ఏమిటో... ఒక చిన్న 2 అంగుళాల ధనవృద్ధి పిరమిడ్‌ను గల్లా (క్యాష్ బాక్స్) పెట్టె లేదా బీరువాలో ఉంచితే మీకు ఆర్థిక వ్యవహారాల్లో అదృష్టాన్ని తెస్తుంది, పలు విధాలుగా కలసి వస్తుంది.

స్ఫటికం :
పారదర్శకతకు ప్రతీక స్ఫటికం. అనుకూల “చి“ శక్తిని ఆకర్షించి గృహాన్ని శక్తిమంతంగా మార్చాలంటే స్ఫటికాన్ని కిటికీ మధ్యలో వ్రేలాడదీయాలనేది ఫెంగ్‌షుయి మాట.

ఫెంగ్‌‌షుయి నాణాలు :
ఈ మూడు నాణాలను ఓ ఎర్రని దారానికి కట్టి, కుబేర స్థానం లేదా ఖాతా పుస్తకాలు, నగదు చిట్టా, పర్సులో ఉంచుకొని సిరిని ఆకర్షించవచ్చు.
About Writer
PNR