1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. ఫెంగ్ షుయ్

ఫెంగ్‌షుయ్‌: కొన్ని అదృష్టవస్తువులు

పంచశక్తులు మనిషిని నడిపించే ప్రకృతి శక్తులు. అయితే ఈ శక్తులు
పంచశక్తులు మనిషిని నడిపించే ప్రకృతి శక్తులు. అయితే ఈ శక్తులు మానవులకు సంతోషాన్ని కొన్నిసార్లు నిరాశ, నిసృహలను కలుగజేస్తాయి. కానీ ఫెంగ్‌షుయ్‌ని అనుసరించి గృహ నిర్మాణం, ఆఫీసు గదులను తీర్చిదిద్ది ఆ గదులలో కొన్ని అదృష్ట వస్తువులను ఉంచితే మరింత అదృష్టవంతులుగా మారే అవకాశం ఉందని ఫెంగషుయ్ శాస్త్రం వివరిస్తోంది. నవ్వుతూ ఉండే బుద్దుడి ప్రతిమ ముఖ ద్వారానికి ఎదురుగా ఉంచితే ధన సంపదలతోపాటు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. బుద్దుడు సంపదలను ఇచ్చే దేవత. అందుకని 30 అంగుళాల ఎత్తుతో కూర్చుని ఉండేటటువంటి లాఫింగ్‌ బుద్ద ప్రతిమను ఇంట్లో ఉంచుకోవటం మంచిది.

అదే విధంగా చైనీయులు అతి పవిత్రంగా కొలిచే జంతువు డ్రాగన్‌. ఈ డ్రాగన్‌ ఉన్న చిత్రాన్ని గృహానికి లేదంటే ఆఫీసుకు తూర్పు దిక్కున ఉంచాలి. డ్రాగన్‌ చిత్రం నుంచి అపరిమిత శక్తి మనలో ప్రవేశించి ఉత్సాహంగా పనిచేయగలుగుతామని ఫెంగషుయ్ వివరిస్తోంది. అలాగే దేవతా రూప చిత్రాల్లో ఫోనిక్స్‌ ఒకటి. నిరంతర ప్రయత్నానికి, పట్టుదలకు ఈ పక్షిని ప్రతీకగా భావించవచ్చు. ప్రతి వ్యాపారవేత్త తన ఆఫీసు గదిలో దక్షిణ దిక్కున ఈ పక్షి తాలూకూ చిత్రాన్ని ఉంచితే నూతనోత్సాహం కలిగిస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సమర్థంగా ఎదుర్కోగలం.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి