1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. ఫెంగ్ షుయ్

ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం ద్వార అమరిక

తూర్పు
తూర్పు,ఉత్తరం: గురుగ్రహానికి ఉత్తమమైన దిశ. ఈ దిశలో ద్వార అమరిక చేస్తే మంచి యోగాలు సమకూరుతాయి.

దక్షిణ దిక్కు: రాహు గ్రహానికి ఉత్తమమైన దిక్కు. నాలుగు అంకెను అదృష్ట సంఖ్యగా భావించే వారు ఈ దిశలో ద్వారాన్ని అమర్చుకోవచ్చు.

పశ్చిమం శుక్ర గ్రహానికి ఉత్తమమైన దిశ. ఈ దిశలో సింహద్వారాన్ని అమర్చుకోదలచే వారు 6వ సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారుగా ఉండాలి. ఇదే సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారు దక్షిణం, ఉత్తరం, పశ్చిమం దిశల్లో కూడా ద్వారాలను నిర్మించుకోవచ్చు.

దక్షిణం తూర్పు: శనీశ్వర గ్రహానికి ఈ దిశ ఉత్తమైంది. 8వ సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారు ఈ దిక్కులో ద్వారాన్ని అమర్చుకోవచ్చు. ఈ దిశలో ద్వారం అమర్చడం ద్వారా మంచి యోగ ఫలాలు సమకూరుతాయి. గృహంలో సకల సంపదలు సమృద్ధిగా ఉంటాయి.

కుజ గ్రహానికి కూడా ఈ దిక్కు ఉత్తమమైంది. తొమ్మిదో సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారు ఈ దిశలో సింహద్వారాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు.

ఉత్తరం, తూర్పు: గురు గ్రహానికి ఉత్తమమైన దిశ. ఈ దిశలో మూడో సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారు సింహద్వారాన్ని అమర్చుకోవచ్చు.

దక్షిణం: రాహు గ్రహాధిపతికి ఉత్తమమైన ఈ దిశలో నాలుగవ సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించే వారు ఇంటి ద్వారా నిర్మాణం చేసుకోవచ్చు.

పశ్చిమం: శుక్ర గ్రహానికి ఉత్తమమైన దిశ. ఈ దిశలో ఆరవ సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించే వారు ద్వారాన్ని నిర్మించుకోవచ్చు.