1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. పంచాంగం

వృషభ లగ్నకారుల సూర్య, చంద్ర ఆధిపత్య ఫలితాలు

ఆధ్యాత్మికం భవిష్యవాణి పంచాంగం వృషభ లగ్నం సూర్యగ్రహం ఆధిపత్యం యోగఫలాలు నాలుగవ స్థానం శుభ కార్యాలు సూర్య
వృషభ లగ్నంలో సూర్యగ్రహం ఆధిపత్యం వహిస్తే యోగఫలాలను ప్రసాదిస్తాడు. సూర్యగ్రహం నాలుగవ స్థానంలో ఉంటే శుభ కార్యాలు జరగటానికి అనుకూలిస్తాయి. వృషభ లగ్నంలో సూర్యుడు ఆధిపత్యం వహిస్తే జాతకులు అన్నీ రంగాల్లో రాణిస్తారు. వ్యాపారంలో అధిక లాభం చేకూరుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి సదుపాయాలు లభిస్తాయి.

సంగీతం వంటి కళాత్మక రంగాల్లో అభివృద్ధి చెందుతారు. అయితే రెండో స్థానంలో సూర్యుడు ఆధిపత్యం వహిస్తే కుటుంబంలో సమస్యలు అధికమౌతాయి. భాగస్వాముల మధ్య కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. సూర్యుడు 3, 5, 7, 10, 11 స్థానాల్లో ఆధిపత్యం వహిస్తే మంచి యోగ ఫలాలను అందిస్తాడు.

వృషభ లగ్నంలో చంద్రుడు ఆధిపత్యం వహిస్తే మంచి ఫలాలు లభించే అవకాశముంది. అదే సమయంలో కీడును జరగే అవకాశాలు కూడా ఉంటాయి. మూడో స్థానంలో చంద్రుడు ఆధిపత్యం వహిస్తే సోదరుల మధ్య విభేధాలు జరగటం వంటివి ఉంటాయి. చంద్రుని ఆధిపత్యంలో జీవితంలో సుఖసంతోషాలు చేకూరుతాయి.

అన్నీ రంగాల్లో రాణించటంతో పాటు రాజకీయాల్లో ప్రముఖులుగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. చంద్రుని ఆధిపత్యంతో పాటు గురు గ్రహ దృష్టి ప్రభావం చేత యోగ ఫలాలు చేకూరుతాయని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు.