రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » వాస్తు శాస్త్రం: దైవానుగ్రహం
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
చరిత్ర ఆరంభకాలంలో మునులు, ఋషులు, మహర్షులు, పండితులు వెలువరిచిన శాస్త్రాల మేరకు వాస్తును హైందవ సాంప్రదాయం పారంపర్యంగా కొనసాగిస్తోంది. వాస్తులో ప్రత్యేకంగా దైవానుగ్రహం తప్పనిసరిగా ఆచరించాలన్నది ప్రధానంగా చెప్పబడుతున్నదే. దైవం అనుమతితోనే వాస్తు ముందుకు సాగుతోందని మానవుడి నమ్మకం. తదనుగుణంగానే మనిషి వేసే ప్రతి అడుగు దైవంతో మొరపెట్టుకున్నాకే ఆరంభిస్తాడు.

భక్తి, నమ్మకంతో దేవుడిని తన గృహంలో ప్రతిష్టించుకునే మానవుడు అందుకు ప్రత్యేక స్థానాన్ని ఎంచుకున్నాడు. ఈ ప్రక్రియ కూడా వాస్తును సంప్రదించటంతో మానవుని వాస్తు దిశకు దేవుని పాత్ర ప్రధానమని అర్థమవుతోంది. తదనుగుణంగానే మానవుడు వాస్తుతోపాటు దేవునిపై నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. వాస్తురీత్యా గృహంలో దేవున్ని ఎక్కడ ప్రతిష్టించాలనే దానిపై ఒక్కో వ్యక్తి జన్మ నక్షత్రాలు, జాతక చక్రాలు ప్రకారం జరుగుతుంది.

అలాగే రుతువులు, సంవత్సరాలు, కాలమానం ప్రకారం వివిధ దిశల్లో దేవుడి విగ్రహాలను, పోటోలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకు వాస్తు ప్రధాన భూమికగా నిలుస్తోంది. వాస్తు ప్రకారమే విగ్రహ ప్రతిష్ట, ఆలయాల నిర్మాణాలు జరుగుతుంటాయి. వాస్తులో ప్రథమంగా నలు దిక్కులను, దిశలుగా విభజించి ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను సూచిస్తారు. ఆది నుంచి ఈ ప్రక్రియ అందుతూనే ఉన్నా మనిషిలో నమ్మకాలకు అనుగుణంగా కాలక్రమేణా రూపాంతరం చెందుతూ వచ్చింది. అదేవిదంగా వాస్తు అనేది జీవితంలో భాగమని నమ్మే ప్రతి జీవికి దైవంపై నమ్మకం ఏర్పడటం సాదరణంగా మారింది.