గుదము అంచున చేతికి తగిలే అర్శమూలలు, మొలలు, సటికాయ్, కామెర్లు తదితర వ్యాధిగ్రస్థులకు ఆయన నాగపంచమి పండుగనాడు స్వస్థత చేకూరుస్తూ ఉంటారు. కానీ పాము కాటుకు విరుగుడు ద్వారానే ఆయన బహుళ ప్రాచుర్యం పొందారు. ప్రదీప్ సింగ్ అనే రిజర్వ్ ఇన్స్పెక్టర్ మాతో మాట్లాడుతూ “ నా స్వీయ అనుభవం నాకు భగవత్గారిపై విశ్వాసాన్ని కలిగించింది. ఒకరోజు నేనొక పామును అంతటా చూసాను, నా కార్యాలయం మరియు ఇంటితో సహా. అటువంటి పరిస్థితి నుంచి నన్ను భగవత్ గారు కాపాడారు. ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు చూస్తే, మహారాజా యశ్వంత్ సింగ్ ఆసుపత్రి ప్రధాన వైద్యుడు అశోక్ బాజ్పేయి పాముకాటు విరుగుడుకు ఇటువంటి ప్రక్రియలను తోసిపుచ్చారు. ఆయన మాట్లాడుతూ “ మన దేశంలోని 70 శాతం పాముల్లో విషం ఉండదు. సహజంగా పాము అంటే ఉన్న భయంతో ప్రజలు మరణిస్తుంటారు. పాము కాటు పొందిన సమయంలో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స అత్యంత ఆవశ్యకం” అని తెలిపారు.
ఎవరేమని అనుకున్నా, ఇది వారి అభిప్రాయము. మీరు ఈ విజయం వెనుక గల నిజానిజాలను తెలుసుకోవాలనుకుంటే, 0731 - 2535534 ఫోను నెంబరుకు కాల్ చేయండి.
ఈ విశ్వాసానికి ఆరంభం: యశ్వంత్ భగవత్ మాకు తెలిపిన దాని ప్రకారం మూలికల ఉపయోగాన్ని ఆయన తన తల్లి నుంచి బాల్యంలోనే నేర్చుకున్నాడు. పాముకాటు విరుగుడు ప్రక్రియను పేరొందిన ఇంద్రజాలికుడు, నూర్ ఖాన్ సాహబ్ నుంచి తెలుసకున్నాడు. భగవంతుని దయతో గత 25 సంవత్సరాలుగా ఈ వృత్తిని నిర్వహిస్తున్నట్లు ఆయన వినమ్రతతో చెప్పాడు.
చర్చలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
|