నాగదోష నివారణ!
|
కానీ 21వ శతాబ్దంలో సైతం ఇటువంటి అంశాలపై విశ్వాసం చూపేవారు వేల సంఖ్యలోనే ఉన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న గ్రహ సమ్మేళనాలలో ‘నాగ దోషం’ ఒకటి. ‘ఏది నిజం’కు కొనసాగింపుగా, ‘నాగదోషం’ తాలూకూ హానికర ప్రభావాల నివారణార్థం వేల సంఖ్యలో భక్తులు విచ్చేసే నాసిక్కు చెందిన త్రయంబక్ గ్రామాన్ని మా తదుపరి గమ్యస్థానంగా ఎంచుకున్నాం.
ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలతెలవారుతుండగానే నాసిక్ను చేరుకుని, త్రయంబకేశ్వర్కు వెళ్ళేందుకు టాక్సీ కోసం నిరీక్షించసాగాము. మా ప్రయాణంలో పాలుపంచుకునేందుకు టాక్సీ డ్రైవర్ గణపతి అంగీకరించడంతో ప్రయాణం ప్రారంభమైంది. గణపతి ఓ మాటలపుట్ట, ఇంకేముంది మాపై ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టాడు. మీ సమస్య ఏమిటి?.. త్రయంబకేశ్వర్కు ఎందుకు వెళ్తున్నారు?.. ‘నారాయణ నాగ బలి’ పూజ ( ‘నాగదోషం’ నివారణకై జరిపే ప్రత్యేక పూజ) కోసం మీరు ఇక్కడకు వచ్చారా? అని వరుస ప్రశ్నలు సంధించిన అతను అంతటితో ఆగలేదు.
| Shruti Agarwal | WD |
ఎవరైనా పూజారిని నియోగించుకున్నారా అని మమ్మల్ని అడిగి, మేము లేదని సమాధానం ఇవ్వడంతో, పూజను శాస్త్రోక్తంగా నిర్వహించే పూజారి ఒకరు తనకు తెలుసునని గణపతి మాతో అన్నాడు. అంతేకాక ‘నాగదోషం’ నివారణార్ధం ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రజలు త్రయంబకేశ్వరాన్ని సందర్శిస్తారని గణపతి తెలిపాడు. ఎట్టకేలకు త్రయంబకేశ్వరాన్ని చేరుకున్నాము.
చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి
|
ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
అక్కడకు వచ్చిన ఒక కుటుంబాన్ని మేము పలకరించాము. ‘దోష’ప్రభావంతో తన కుమార్తె శ్వేతకు పెళ్ళి కుదరక అనేక సమస్యలను ఎదుర్కుంటున్నామని కుటుంబ పెద్ద సురేష్ ఖాండే మాతో అన్నారు. ఒక పూజారి సలహా మేరకు తాము ఇక్కడకు వచ్చామని ఆయన తెలిపారు. తమ బంధువుల్లోని ఒకతను ఇలాగే దోష ప్రభావ పీడితులయ్యారని, అయితే ప్రత్యేక పూజలు చేయించడంతో అతని పరిస్థితి కుదుటపడిందని శ్వేత తల్లి మాతో చెప్పారు.
ఖాండే కుటుంబంతో పాటుగా ‘నాగ దోష’ నివారణార్ధం అక్కడకు వచ్చిన అనేక మంది ప్రజలను మేము చూసాము. వారిలో అనేకమంది భక్తులు అత్యున్నత అర్హతలు కలవారని తెలిసి ఆశ్చర్యపోయాము. అక్కడే ఉన్న కమలాకర్ అకోల్కర్ అనే పూజారిని మేము కలువగా - ‘రాహువు’, ‘కేతువు’ల మధ్య గ్రహాలు చేరుకున్నప్పుడు ‘నాగదోషం’ సంభవిస్తుందని ఆయన మాతో అన్నారు. అటువంటి సమయంలో నాగదోషం బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, అంతేకాక ప్రజలు తమ పితృదేవతలకు ‘శ్రద్ధ’ కర్మలను సరిగ్గా నిర్వర్తించనట్లయితే ఈ యోగం కలుగుతుందని పూజారి వివరించారు.
| Shruti Agarwal | WD |
