శ్మశానంలో భయానక ప్రార్థన
|
ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
సందేహ నివృత్తి కోసం , సేవేంద్రనాధ్ దాదాజీ అనే శ్మశాన తాంత్రికుని మేము కనుగొన్నాము, ఆయన తాంత్రిక గురువు “గురు” తారాపీథ్‌కు శిష్యుడు. తాము మూడు వేర్వేరు పద్ధతులలో ప్రార్ధనలు చేస్తామని ఆయన తెలిపాడు. అవి -“ శ్మశాన సాధన”, “శివసాధన” మరియు “శవ సాధన”. మూడింటిలోనూ క్లిష్టమైనది “శవ సాధన”.
|
శవ సాధనలో కాలుతున్న శవాన్ని వినియోగిస్తారు. పురుష భక్తుడు స్త్రీ శవాన్ని అలాగే స్త్రీ భక్తురాలు పురుష శవాన్ని సాధనలో ఉపయోగించాలి. ఈ ప్రార్థన పరాకాష్టకు చేరుకోగానే, శవం భక్తుల కోరికలను తీరుస్తుంది. ఈ ప్రక్రియ జరుగుతుండగా, సామాన్య ప్రజలు శ్మశానంలోకి ప్రవేశించరాదు. ఈ ప్రార్థనలు ఉజ్జయినీలోని “తారాపీథ్ శ్మశానం”, “కామాక్యపీథ్ శ్మశానం” , “త్రయంబకేశ్వర్ శ్మశానం” మరియు “చక్రతీర్థ శ్మశానాల”లో తరుచుగా జరుగుతుంటాయి.
చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
|
ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరొక మాంత్రికుడైన చంద్రపాల్ తాను నిర్వహిస్తున్న “శవ సాధన” పద్ధతిలోని కొన్ని భాగాలను వీక్షించేందుకు మమ్మల్ని అనుమతించాడు. ఉజ్జయినీకి దగ్గరగా గల క్షిప్రా నదికి సమీపంలో అతడు “శవసాధన” నిర్వహించాడు. ఈ ప్రక్రియలో తాంత్రికుడు యావత్ శ్మశానాన్ని తన పర్యవేక్షణలో తీసుకొని కొన్ని వాక్యాలను మంద్ర స్థాయిలో వల్లె వేస్తాడు.
|
శవానికి చెందిన ఆత్మ సరైన దిశలో శ్మశానానికి చేరుకునేందుకుగాను వెలుగుతున్న “దియా” కొవ్వొత్తులను క్షిప్రా నదికి తాంత్రికుడు సమర్పిస్తాడు. అనంతరం తన ప్రార్థనలకు ఇతర ఆత్మల రాకను నిరోధించేందుకు తాంత్రికుడు ఈల వేస్తాడు. శవం చుట్టూ సరిహద్దు గీతలను గీచిన అనంతరం శవంపై నిల్చొని తాంత్రికుడు ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తాడు.
చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
|
ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మాలో అనేక సందేహాలు కలుగుతుండగా ఆ ప్రాంతాన్ని వదలి వచ్చేశాము. కానీ ఈ ప్రక్రియ ఆసాంతం మేము కనుగొన్నదేమిటంటే, విభిన్న ప్రపంచానికి చెందిన ఆ వ్యక్తులు అటువంటి గగుర్పొడిచే మరియు భయంకరమైన ప్రార్థనలో పాల్గొనడానికి ఇష్టపడడం.
చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
