మా తీర్థయాత్రలో ఈసారి మంగళనాథ (కుజుడు) స్వామివారి ఆలయాన్ని దర్శించి, దాని ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ అధ్యాత్మికత ప్రాంతాల్లో ఒకటైన ఉజ్జెయిని నగరంలో ఈ దేవాలయం కొలువై ఉన్నది. పురాణ గాధ ప్రకారం, ఉజ్జెయిని నగరం కుజుని తల్లి. జాతకపత్రంలో ఎవరైతే కుజుని కలిగి ఉంటారో వారు చాలా శక్తివంతులుగా ఉంటారు. అంతేకాదు.. తమకు అనుకూలించని గ్రహాలను మేలు చేయాల్సిందిగా కోరుకునేందుకు భక్తులు మంగళనాథుని సందర్శిస్తారు.
అయితే మన దేశంలో మంగళనాథుడు కొలువై ఉన్న ఆలయాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఉజ్జెయిని కుజుడు పుట్టిన ప్రదేశం కావటంతో ఈ ప్రదేశానికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ దేవాలయం కొన్ని శతాబ్దాలనాటిది. సింధియా రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఉజ్జెయిని నగరానకి మహాకాళ్ నగరంగా మరో పేరు కూడా ఉంది. దీనితో మంగళనాథ స్వామి శివుని ఆకారంలో పూజలందుకుంటున్నాడు. ఇక్కడకు ప్రతి మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు వేంచేస్తూ, తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. కుజ గ్రహం పుట్టుక ఈ క్రింది విధంగా ఉన్నది.
ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తన రక్తం నుంచి వందల కొద్దీ రాక్షసులు జన్మిస్తారన్న వరాన్ని అంధకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని నుంచి పొందుతాడు. ఇక అప్పటి నుంచి ఆ రాక్షసుడు అవంతికపై విరుచుకపడ్డాడు. దీనితో బాధితులందరూ పరమేశ్వరుని శరణుజొచ్చారు. భక్తజన కోటి రక్షణకు శివశంకరుడు అంధకాసురునిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శివునికి ముచ్చెమటలు పోయడం ఆరంభమవుతుంది. రుద్రుని చమట బిందువు వేడికి, ఉజ్జెయిని రెండు భాగాలుగా విడిపోయి కుజగ్రహం ఆవిర్భవించింది. అంధకాసురుని పరమేశ్వరుడు వధించాడు.
|