ఓంకారేశ్వరుడు మరియు మామ్మలేశ్వరుడు గురించి పురాణాలు ఎంతో గొప్పగా ప్రవచించాయి. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ ఓంకారేశ్వర లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరాన, మాల్వా ప్రాంతంలోని మాంధాత పర్వతంపై కొలువై ఉంది. నేలకు తాకకుండా సహజంగా ప్రతిష్ఠితమై ఉండటం ఈ జ్యోతిర్లింగం ప్రత్యేకత. అంతేకాదు లింగం చుట్టూ ఎప్పుడూ నీళ్లు ఆవరించి ఉంటాయి. పైన ఎటువంటి ప్రాసాదం లేకుండా నెలకొనడం శ్రీ ఓంకారేశ్వర లింగం మరో ప్రత్యేకత. దేవాదిదేవుడైన ఈశ్వరుని ప్రతిమ దేవాలయం అగ్రభాగంపై ఏర్పాటు చేయబడింది.
దర్శనం కోసం రెండు గదులను దాటుకుని దేవాలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించాలి. కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఓంకారేశ్వర మరియు మామ్మలేశ్వర పుణ్య క్షేత్రాలను గురించిన ప్రస్తావన శివపురాణంలో విశేషంగా చెప్పబడింది. శివపురాణంలో చెప్పిన దాని ప్రకారం, సూర్య వంశీయుడైన మాంధాత ఇద్దరు కుమారులైన అంబరీష్ మరియు ముచికుంద్‌లు సదాశివుని ప్రసన్నం చేసుకోడం కోసం ఘోర తపస్సు చేసారు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంతేకాక అత్యుత్తమైన త్యాగాలను వారు చేసారు; అందుకే ఓంకారేశ్వరుడు నెలవైన పర్వతానికి మాంధాత అని పేరు వచ్చింది. ఓంకారేశ్వర దేవాలయం ఉత్తర భారత శైలిలో నిర్మించబడింది. ఈ దేవాలయం కృత యుగంనాటిది. పురాణేతిహాసాలను అనుసరించి చూస్తే, వింధ్య పర్వతాన్ని సందర్శించిన దేవర్షి నారదుడు వింధ్య పర్వతం ఎదుట మేరు పర్వతం యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తూ గానం చేసాడు.
గానసారంతో దిగాలు పడిన వింధ్య పర్వతం పరమేశ్వరుని వేడుకొనగా, ఓంకారేశ్వర మరియు అమలేశ్వరులుగా ప్రత్యక్షమైన మహాశివుడు, శివభక్తులకు ఆటంకం కలుగని రీతిలో పెరిగే వరాన్ని వింధ్య పర్వతానికి అందించాడు. కానీ వరగర్వంతో విర్రవీగిన వింధ్య తన పెరుగుదులను పరిమితం చేసుకోలేదు సరికదా, సూర్య చంద్రుల గమనాన్ని నిరోధించింది.వింధ్య పర్వతానికి అదుపు చేసేందుకు గాను తాను తిరిగి వచ్చేంతవరకు పెరగవద్దు అని అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని ఆదేశించాడు.
|